Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Oct 07, 2021 | 7:32 AM

స్నేహితుడంటే ఎవరు..? స్నేహితుడంటే ఎలా ఉండాలి..? నిజమైన స్నేహితుడు అంటే ఎవరు..? స్నేహం అంటే ఒక నమ్మకం. స్నేహం అనేది...

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..
Chanakya Niti

Follow us on

స్నేహితుడంటే ఎవరు..? స్నేహితుడంటే ఎలా ఉండాలి..? నిజమైన స్నేహితుడు ఎవరు..? స్నేహం అంటే ఒక నమ్మకం. స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అలాంటి వారిని నువ్వు స్నేహితులుగా ఎంచుకునే ప్రయత్నం చేయాలి.ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తనకు మద్దతునిచ్చే స్నేహితుడిని కోరుకుంటారు. అయితే చాలామంది ఆలోచించకుండానే స్నేహితులుగా మారుతారు. కొంత కాలం తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఒక తెలివైన వ్యక్తిని స్నేహితుల ఎంచుకోవాలి. తెలివైన వ్యక్తులు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపెడుతారు.

ఆచార్య చాణక్యుడు తన దౌత్యం, వ్యూహంతో ఒక సాధారణమైన వ్యక్తి చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. చాణక్యుడు తన ఎథిక్స్ పుస్తకంలో జీవితంలోని అన్ని కోణాల గురించి ప్రస్తావించాడు. అతను జీవితంలోని అన్ని అనుభవాల గురించి తన పుస్తకంలో నీతిశాస్త్రంలో రాశాడు. నీతిశాస్త్రంలో రాసిన విషయాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు.

స్నేహితుడిని ఎన్నుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని తను రాసిన చాణక్య నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. ఒక వ్యక్తి ఆలోచించకుండా స్నేహం చేస్తే.. భవిష్యత్తులో అతను పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. స్నేహం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చాణక్యుడు ఆ నీతి శాస్త్రంలో వెల్లడించాడు.

అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా.. మీ స్థానం, లక్షణాలు, సంపద ద్వారా ప్రభావితమైన వ్యక్తి మీతో స్నేహం చేస్తాడు. అలాంటి వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఎందుకంటే మీ నుంచి డబ్బు , ప్రతిష్టలు పోయినప్పుడు ఈ వ్యక్తులు మిమ్మల్ని విడిచిపెడతారు.

నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి..

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా,  మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంటే ఉంటారు.. మీకు సహాయంగా నిలుస్తారు.. మిమ్ములను వదిలపెట్టి వెళ్లిపోరు. మీవెంటే ఉంటూ మీకు ధైర్యాన్ని పెంచడంతో పాటు.. సరైన సలహాను కూడా అందిస్తారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పుడు స్నేహితులు మిమ్మల్ని విడిచిపెడతాడు. అందుకే సరైన వ్యక్తిని కష్టాల్లో ఉన్నపుడు మాత్రమే గుర్తించవచ్చు.

చెడు స్నేహితుడు

ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి మరికొన్ని కీలక సంగతులను తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఇతరులకు హాని చేసే వారు… అలాంటి వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. ఒక వ్యక్తి  సాంగత్యం మీ జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. అందుకే చెడు స్వభావం ఉన్న వ్యక్తులను ఎప్పుడూ స్నేహితులుగా ఎంచుకోవద్దు.

ఇవి కూడా చదవండి: Huzurabad by poll: ఉప పోరు జోరందుకున్న రాజకీయం.. ఇప్పటివరకు 9 నామినేషన్లు.. ఈసీ కండీషన్స్‌పై అభ్యర్థుల గుర్రు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu