Tirumala Brahmotsavam: ఇవాళ్టి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. రంగ రంగ వైభవంగా ముస్తాబైన తిరుమలగిరులు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో..
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ సాయంత్రం వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణ వేదికలోనే నిర్వహించనున్నారు. వాహన సేవలు ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ తిరుమలలో పండుగ వాతావరణం నెలకొనేలా కొద్దిపాటి ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
మొదటిరోజు రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 11వ తేదీన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవ జరగనుంది. గరుడసేవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం సీఎం జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
గురువారం సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. రాత్రికి పెద్దశేష వాహన సేవ,
8న ఉదయం చిన్నశేషవాహన సేవ, రాత్రి హంసవాహన సేవ
9న సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి
10న ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం
11న మోహినీ అవతారం, రాత్రి గరుడవాహనసేవ
12న ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వ భూపాల వాహనం, రాత్రి గజవాహనసేవ
13న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
14న ఉదయం రథం బదు లుగా సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వవాహనం
చివరిరోజు 15వ తేదీన ఉదయం చక్రస్నానం నిర్వహించి, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ను పూర్తిచేయనున్నారు. మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ లేదా.. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌ను టీటీడీ తప్పనిసరి చేసింది. ఈ రెండు లేనివారిని శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..