Navratri 2021: వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. స్వర్ణకవచాలంక్రుత అలంకారంతో విజయవాడ దుర్గమ్మ..
Navaratri 2021: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 15వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి..
Navaratri 2021: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 15వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిదిరోజులపాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవి శ్రీ స్వర్ణకవచాలంక్రుత అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
అయితే, ఇంద్రకీలాద్రిపై కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇందులో భాగంగానే.. రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. ఉచిత దర్శనం నాలుగు వేలు, 100 రూపాయల టిక్కెట్ దర్శనం 3 వేల మందికి, 300 రూపాయల టిక్కెట్ దర్శనం మూడు వేల మంది చొప్పున అన్‌లైన్ స్లాట్ ఉన్న వారికి మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు మూడు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు.
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో.. ఇక తెలంగాణలోని చారిత్రక వరంగల్‌లో స్వయం వ్యక్తమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఇవాళ్టి నుంచి దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యారు. ఈ ఉత్సవాలు 16వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో బాగంగా.. 12వ తేదీన మంగళవారం మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ,13వ తేదీన బుధవారం చద్దులబతుకమ్మ, పండుగ రోజు భద్రకాళి అమ్మవారి జన్మదినోత్సవం అయిన 14వ తేదీన మహానవమి మహా పూర్ణాహుతి, 15వ తేదీన విజయదశమి దసరా సందర్భంగా హంసవాహన తెప్పోత్సవం.,16వ తేదీ శనివారం శ్రీ భద్రకాళి భద్రేశుల కల్యాణం నిర్వహించబడుతాయని ఆలయం కార్యనిర్వాహణ అధికారిని రాయల సునీత తెలిపారు.
Also read:
లఖీమ్‌పూర్ ఖేరి: రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..
YSR Asara: ‘వైఎస్సార్ ఆసరా’ సొమ్ముల జమ నేడే.. ఒంగోలులో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి
Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు..