NFSU Recruitment: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేలు జీతం పొందే అవకాశం.

NFSU Recruitment 2021: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌సీయూ) దేశంలో ఉన్న పలు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం...

NFSU Recruitment: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేలు జీతం పొందే అవకాశం.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 07, 2021 | 8:53 PM

NFSU Recruitment 2021: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌సీయూ) దేశంలో ఉన్న పలు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన ఈ యూనివర్సిటీ గుజరాత్‌, గాంధీనగర్ కేంద్రంగా పనిచేస్తుంది. నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 101 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* గాంధీ నగర్‌, ఢిల్లీ, గోవా, త్రిపురల్లో క్యాంపస్‌లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ నర్సింగ్‌, ఫోరెన్సిక్‌ సైకాలజీ, క్రిమినాలజీ, సైబర్‌ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదటి రౌండ్‌ ఇంటర్వ్యూ, ప్రజంటేషన్‌, రెండో రౌండ్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 90,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజుగా రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 20-10-2021 చివరి తేదీ కాగా.. దరఖాస్తుల హార్డ్‌కాపీలు పంపడానికి 25-10-2021 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IT Department Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటి డిపార్ట్‌మెంట్ 21 ఖాళీలు.. ఇప్పుడే.. ఇలా అప్లై చేయండి..

Railway Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ కేంద్రంగా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి

AP RGUKT 2021 Results: విద్యార్థులకు అలెర్ట్.. ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..