NSU Tirupati Recruitment: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
NSU Tirupati Recruitment 2021: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్‌ఎస్‌యూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్...
NSU Tirupati Recruitment 2021: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్‌ఎస్‌యూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ రిజస్టార్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, గ్రూప్ సి ఎంటీఎస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
* యోగా, అద్వైత వేదాంత, విశిష్ఠద్వైత వేదాంత, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఎస్‌ఎస్‌సీ, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ష్ డిగ్రీ (బీఈడీ), మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పటు సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి, అనంతరం హార్డ్ కాపీలను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు హార్డ్ కాపీలను ది రిజిస్టార్, నేషనల్ సాంస్రిట్ యూనివర్సిటీ, తిరుపతి 517507, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూడీ / మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతరులు మాత్రం రూ. 800 చెల్లించాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు 08-10-2021 చివరి తేదీ కాగా హార్డు కాపీలను పంపడానికి 14-10-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LPG Gas: గ్యాన్ సిలెండర్ బుక్ చేసుకోండి.. బంగారం తీసుకోండి.. పేటీఎం అదిరిపోయే ఆఫర్..వివరాలివే!