Sivakarthikeyan: సినిమాకు ఎల్లలు లేవు… నా సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది: శివకార్తికేయన్

రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’.

Sivakarthikeyan: సినిమాకు ఎల్లలు లేవు... నా సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది: శివకార్తికేయన్
Shiva
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 07, 2021 | 8:31 PM

Sivakarthikeyan: రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌… గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ “థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు నాకు మోటివేషన్… రెండేళ్లుగా వాటిని మిస్ అవుతున్నా అన్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీ చప్పట్లు, ఈలలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక అక్టోబర్ 9న ‘డాక్టర్’తో థియేటర్లలోకి వస్తున్నాను… ‘వరుణ్ డాక్టర్’ ట్రైల‌ర్‌కు మంచి స్పందన లభించింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులు మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉంది అని శివకార్తికేయన్ అన్నారు. నా సినిమా ట్రైలర్ విడుదల చేసిన హీరో నితిన్‌కు స్పెషల్ థాంక్స్ తెలిపారు శివ.

‘వరుణ్ డాక్టర్’ సినిమాలో నటించినప్పుడు, సినిమా చూసినప్పుడు కొత్తగా అనిపించింది. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఫీలవుతారని ఆశిస్తున్నాను అన్నారు.  కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాకు ఎల్లలు లేవు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అందరూ థియేటర్లకు వెళ్లి చూడండి. మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుని… సేఫ్‌గా సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి” అని శివకార్తికేయన్  అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vaishnav Tej : ఆ స్టార్ హీరోల కథలను ఎంచుకోవలని ఉంది.. మనసులో మాట చెప్పిన వైష్ణవ్ తేజ్..

Bigg Boss 5 Telugu: రవి- షణ్ముఖ్ మధ్య మంటలు.. కెప్టెన్ అయ్యి చూపిస్తానంటున్న శ్రీరామ్..

Taapsee Pannu: టాలీవుడ్ టూ బాలీవుడ్ అదరగొట్టిన తాప్సీ.. సోషల్ మీడియాలో ఫొటోస్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!