AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnav Tej : ఆ స్టార్ హీరోలా కథలను ఎంచుకోవలని ఉంది.. మనసులో మాట చెప్పిన వైష్ణవ్ తేజ్..

మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు.

Vaishnav Tej : ఆ స్టార్ హీరోలా కథలను ఎంచుకోవలని ఉంది.. మనసులో మాట చెప్పిన వైష్ణవ్ తేజ్..
Vaishnav
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2021 | 7:26 AM

Share

Vaishnav Tej’s Konda Polam:

మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వైష్ణవ్ మాట్లాడుతూ ఆసక్తికరవిషయాలు తెలిపారు. ”  కొండపొలం అనే అంశమే కొత్తది. నేను ఎప్పుడూ వినలేదు. పైగా క్రిష్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన మేకింగ్ అంటే ఇంకా ఇష్టం అన్నారు వైష్ణవ్. మొదటగా క్రిష్ గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసం కాదని అనుకున్నాను. ఊరికే రమ్మంటున్నారేమో అనుకున్నాను. కానీ సినిమా అని చెప్పిన తరువాత హరిహర వీరమల్లు తరువాత ఉంటుందేమో అనుకున్నాను. కానీ వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు దాంతో షాక్ అయ్యాను అన్నారు వైష్ణవ్.

క్రిష్ గారు కొండపొలం గురించి చెప్పినప్పుడు.. ఇంకా ఉప్పెన విడుదల కాలేదు. ఆయన తీసిన వేదం, గమ్యం నాకు చాలా ఇష్టం. నన్ను క్రిష్ గారు సంప్రదించడంతో ఎంతో సంతోషంగా ఫీలయ్యాను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు వైష్ణవ్. రంగస్థలం నుంచి అందరూ సినిమాను చూసే కోణం మారిపోయింది. ఇందులో ప్రతీ ఒక్క ఎమోషన్ ఉంటుంది అన్నారు. ఉప్పెనలో ఫిషర్ మ్యాన్ పాత్రను పోషించాను. దానికి తగ్గట్టుగానే నా మేకోవర్ ఉంటుంది. ఇక ఇందులోనూ అంతే రగ్డ్ లుక్‌లోనే కనిపిస్తాను. నా మూడో సినిమాగా కమర్షియల్, లవ్ స్టోరీ చేస్తున్నాను. అందులో నా లుక్ వేరేలా ఉంటుంది అని హింట్ ఇచ్చారు వైష్ణవ్.

కరోనా సమయంలో ఇంట్లోనే ఉండ‌డం వ‌ల్ల వెంట‌నే షూటింగ్ చేయడం మరీ అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ఆ ఎండల్లో రోజంతా మాస్కులు పెట్టుకుని ఉండటం రెండు మూడు రోజులు  కష్టంగా అనిపించింది. కానీ ఆ తరువాత అలవాటైపోయిందన్నారు వైష్ణవ్. ఏమీలేని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగే ఓ కుర్రాడి కథ. అడవి అంటే ఇష్టం, ఆ అడవి, అక్కడి అమ్మాయితో ప్రేమలో పడే  కుర్రాడి జీవిత ప్రయాణం, ఆ గ్రాఫ్ బాగుంటుంది. ఈ కథ, పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పూర్తిగా అక్కడి యాసలో మాట్లాడాను. ఉప్పెనలో  కొన్నిచోట్ల ప్రేక్షకులకు అర్థంకాద‌ని  యాస వాడలేదు. కానీ కొండపొలంలో పూర్తిగా  అక్కడి యాసలోనే మాట్లాడాను.

కొండపొలంలో అందరూ సీనియర్స్ నటించారు. అందరి దగ్గరి నుంచి చాలా నేర్చుకోవచ్చని అనుకున్నాను. వారు డైలాగ్స్‌ను ఇట్టే చెప్పేసేవారు. నాకు చాలా టెన్షన్‌గా అనిపించేది. కోట గారు ఆ వయసులో వచ్చి నటించడం చాలా గ్రేట్ అనిపించింది. ఆయన వచ్చినప్పుడు మాత్రం అందరం మాస్కులు పెట్టేసుకునేవాళ్లం. సాయి చంద్ గారు ఎప్పుడూ ఎంతో  ఎనర్జీగా ఉండేవారు. అంతే ఎనర్జీగా నటించేవారు. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్ అన్న అలా హిట్లు కొడుతున్నాడు.. నాక్కూడా అలానే కొట్టాలనిపిస్తుంది. మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త కథలు ఎంచుకోవాలనిపిస్తుందన్నారు వైష్ణవ్..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: రవి- షణ్ముఖ్ మధ్య మంటలు.. కెప్టెన్ అయ్యి చూపిస్తానంటున్న శ్రీరామ్..

Taapsee Pannu: టాలీవుడ్ టూ బాలీవుడ్ అదరగొట్టిన తాప్సీ.. సోషల్ మీడియాలో ఫొటోస్..

వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?