LPG Gas: గ్యాన్ సిలెండర్ బుక్ చేసుకోండి.. బంగారం తీసుకోండి.. పేటీఎం అదిరిపోయే ఆఫర్..వివరాలివే!
పండుగ వేళ గ్యాస్ వినియోగదారులకు పేటీఎం బంగారు కబురు అందించింది. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం గ్యాస్ బుకింగ్ పై ప్రత్యెక ఆఫర్లను ప్రకటిస్తుంటుంది.
LPG Gas: పండుగ వేళ గ్యాస్ వినియోగదారులకు పేటీఎం బంగారు కబురు అందించింది. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం గ్యాస్ బుకింగ్ పై ప్రత్యెక ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం పేటీఎం (Paytm) ‘నవరాత్రి గోల్డ్’ ఆఫర్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 7- 16 మధ్య ప్రతిరోజూ, 5 మంది వినియోగదారులు పేటీఎం (Paytm) యాప్‌లో సిలిండర్లను బుక్ చేయడం కోసం రూ. 10,001 విలువైన బంగారాన్ని గెలుచుకునే అవకాశం పొందుతారు.
పేటీఎం యాప్‌లోని ‘బుక్ గ్యాస్ సిలిండర్’ ఫీచర్‌ని ఉపయోగించి వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, వినియోగదారులందరూ ప్రతి బుకింగ్‌పై 1000 క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను కూడా పొందుతారు. వీటిని అగ్ర బ్రాండ్‌ల నుండి డీల్స్, గిఫ్ట్ వోచర్‌లలో రీడీమ్ చేయవచ్చు. ఈ ఆఫర్ మూడు ప్రధాన ఎల్పీజీ కంపెనీలు ఇండేన్ (Indane), హెచ్పీ(HP) గ్యాస్, భారత్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై వర్తిస్తుంది.
Paytm నుండి ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి.. వినియోగదారులు ‘బుక్ గ్యాస్ సిలిండర్’ టాబ్ కి వెళ్ళండి. ఇక్కడ మీ గ్యాస్ ప్రొవైడర్‌ని ఎంచుకోవాలి. దీని తర్వాత వారు మొబైల్ నంబర్, LPG ID అదేవిధంగా వినియోగదారు సంఖ్యను నమోదు చేయాలి.
పేటీఎం వాలెట్ (Paytm), పేటీఎం (PaytmUPI) యూపీఐ, కార్డులు, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ (Paytm Post Paid)వంటి ఎంపికలను కలిగి ఉన్న గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం వినియోగదారులు తమ ఇష్టపడే చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. దీనితో, వినియోగదారులు తమ గ్యాస్ సిలిండర్లను ఇప్పుడే బుక్ చేసుకుని, వచ్చే నెలలో చెల్లించే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: RTA: అలా చేస్తే బస్సులు సీజ్ చేస్తాం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక..