Dussehra Special Trains: దసరా పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైలు సర్వీసులు.. ఇవిగో వివరాలు
South Central Railway: దసరాకు సొంత ఊర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది. విద్యా సంస్థలకు, పలు కంపెనీలకు సెలవులు ఉంటాయి.
దసరాకు సొంత ఊర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది. విద్యా సంస్థలకు, పలు కంపెనీలకు సెలవులు ఉంటాయి. దాంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు నగర వాసులు రెడీ అవుతున్నారు. అయితే పండుగ సీజన్‌లో రద్దీ దృష్ట్యా ప్రతిసారి బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతుంటాయి. ఈసారి పాసింజర్స్‌కు ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ, అటు రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్పెషల్ బస్సులు, ట్రైన్స్ అదనంగా నడుపుతున్నారు. ఈ క్రమంలోనే పండుగ రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులు నడపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు సర్వీసులకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
In order to clear extra rush during Dussehra festival, SCR will run the special trains between Secunderabad-Narsapur & Secunderabad-Kakinada Town @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/xjFOdRit2P
— South Central Railway (@SCRailwayIndia) October 7, 2021
- ట్రైన్ నంబర్ 07456 సికింద్రాబాద్ నుంచి నర్సాపురం(14-10-2021). 14వ తేదీ రాత్రి 10 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తెల్లారి 10 గంటలకు నర్సాపురం చేరుతుంది.
- ట్రైన్ నంబర్ 07455 నర్సాపురం నుంచి సికింద్రాబాద్(17-10-2021). 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు నర్సాపురం నుంచి బయలుదేరుతుంది. 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతోంది.
- ట్రైన్ నంబర్ 07053 సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్(14-10-2021). 14వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతోంది. 15వ తేదీ ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్ చేరుతోంది.
- ట్రైన్ నంబర్ 07054 కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్17-10-2021). 17వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతోంది. 18వ తేదీ ఉదయం 8 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతోంది.
Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి
చాంతాడంత పొడవున్న నాగుపాము.. సింపుల్‌గా నీరు తాగించిన యువకుడు.. షాకింగ్ వీడియో