Viral Video: రెస్క్యూ టీమ్ మధ్య క్యూట్ క్యూట్‌గా గున్న ఏనుగు.. తల్లిదగ్గరకు చేరిన వీడియో వైరల్
Viral Video: సర్వసాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులు చేసే పనులే చాలా ముద్దుగా ఫీల్ అవుతాం.. ఇక సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి..
Viral Video: సర్వసాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులు చేసే పనులే చాలా ముద్దుగా ఫీల్ అవుతాం.. ఇక సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత కుక్క, పిల్లి, ఏనుగు ఇలా ఏ జంతువులు ఏ పనులు చేసినా ముద్దుగా అనిపిస్తూ.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా .. మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తూ.. సంతోషం కలిగిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఏనుగులు చేసే పనులైతే పిల్లలనే కాదు.. పెద్దలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే సర్కస్ లో ఏనుగులు సైకిల్ తొక్కినా, బంతి ఆట ఆడినా ఈలలు వేస్తూ మరి ఎంజాయ్ చేస్తారు. అయితే మనుషులే కాదు.. జంతువులూ కూడా తమ తల్లిదగ్గరే పిల్లలు ఉండాలని కోరుకుంటాయి. దారి తప్పి తల్లి నుంచి విడిపోతే అటు తల్లి తల్లడిలిపోతుంది. ఇటు పిల్ల తల్లి జాడ కోసం వెదుకుతుంది. ఎందుకంటే సృష్టిలో మాతృప్రేమకు జంతువులు కూడా అతీతం కాదు.. ఈ నేపథ్యంలో అడవిలో దారి తప్పిన ఓగున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తల్లి ఏనుగు దగ్గరకు చేర్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని అటవీ శాఖ ఒక గున్న ఏనుగుని రెస్క్యూ టీమ్ తీసుకుని వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీలగిరి పర్వతాలలోని ముదుమలై నేషనల్ పార్క్ అధికారులు తల్లి నుంచి విడిపోయిన ఓ పిల్ల ఏనుగుని రక్షించి తిరిగి తల్లివద్దకు చేర్చారు. ఈ వీడియోను తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ (పర్యావరణ మరియు అటవీ) సుప్రియ సాహు షేర్ చేశారు. పిల్ల ఏనుగుని తన కుటుంబం వద్దకు చేర్చిన మీ కృషి గొప్పది అంటూ అటవీ అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. తన ముందు వెనుక అధికారులు నడుస్తుంటే.. ఒక రాజులా ఠీవిగా నడుస్తున్న గున్న ఏనుగుకి నెటిజన్లు ఫిదా.. ఇప్పటి వరకూ అనేక లైక్స్ 146,000 కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో.
తమిళనాడులోని వాయువ్య నీలగిరి కొండలపై ఉన్న ముదుమలై జాతీయ ఉద్యానవనంలో అనేక అంతరించిపోతున్న జాతులకు చెందిన భారతీయ ఏనుగు, బెంగాల్ పులి , భారతీయ చిరుతపులులు ఉన్నాయి.
A kutty baby elephant was reunited with the family after rescue by TN foresters in Mudumalai. Most heartwarming indeed. Kudos ?? #TNForest #elephants #mudumalai pic.twitter.com/eX9gBd3oK7
— Supriya Sahu IAS (@supriyasahuias) October 6, 2021