PM Cares For Children: పిల్లలకు అండగా పీఎం కేర్.. చదువు, బీమా పూర్తిగా ఉచితం.. 18 ఏళ్ల నుంచి స్టైఫండ్.. 23 ఏళ్లు నిండితే రూ. 10 లక్షలు కూడా..!

పిల్లలకు పీఎం కేర్ అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వెల్లడించింది. ఈమేరకు తాజాగా వాటికి సంబంధించిన మార్గదర్శకాలను మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

PM Cares For Children: పిల్లలకు అండగా పీఎం కేర్.. చదువు, బీమా పూర్తిగా ఉచితం.. 18 ఏళ్ల నుంచి స్టైఫండ్.. 23 ఏళ్లు నిండితే రూ. 10 లక్షలు కూడా..!
Pm Cares For Children Scheme
Follow us

|

Updated on: Oct 07, 2021 | 4:30 PM

PM Cares For Children: పిల్లలకు పీఎం కేర్ అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వెల్లడించింది. ఈమేరకు తాజాగా వాటికి సంబంధించిన మార్గదర్శకాలను మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 29 మే, 2021 న కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన పిల్లల సమగ్ర సంరక్షణతోపాటు వారి రక్షణ, ఆరోగ్య బీమా, చదువు లాంటి పలు విషయాలను పీఎం కేర్స్ చూస్తుందని ప్రకటించింది. అలాగే వారికి 23 సంవత్సరాలు నిండిన తరువాత ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు.

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ నూతన మార్గదర్శకాల ప్రకారం.. విద్య, ఆరోగ్యం, 18 సంవత్సరాల వయస్సు నుంచి నెలవారీ స్టైఫండ్ ఇవ్వనున్నారు. అలాగే వారికి రూ. 23 సంవత్సరాలు నిండినతరువాత రూ. 10 లక్షలు అందించనున్నారు.

అర్హులెవరు: 29 మే 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తించనుంది. పీఎం కేర్స్ పథకం ప్రయోజనాలను గుర్తించిన ప్రతి లబ్ధిదారునికి 23 సంవత్సరాలు నిండే వరకు ఈ పథకం కొనసాగుతుంది.

అర్హతలు: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లలందరికీ ఇది వర్తిస్తుంది. అలాగే 11 మార్చి 2020 నుంచి WHO జారీ చేసిన 31 డిసెంబర్ 2021 వరకు కోవిడ్‌తో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు మాత్రమే వర్తించనుంది. అయితే తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండకూడదు.

ఈ పథకం అందించే ముఖ్యమైన ప్రయోజనాలు: 1. కోవిడ్ కారణంగా తల్లిద్రండులు కోల్పోయిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండనుంది. 2. ఇలాంటి వారికి 18 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి స్టైఫండ్ ఇవ్వనుంది. అలాగే వారికి 23 సంవత్సాలు వచ్చిన తరువాత పీఎం కేర్ నుంచి రూ. 10 లక్షలు అందించనున్నారు. 3. అలాగే ఉన్నత విద్య కోసం లోన్ కూడా ఇస్తారు. అలాగే పీఎం కేర్స్ తరపున ఆలోన్‌కు అయ్యే వడ్డీని చెల్లించనున్నారు. 4. 18 సంవత్సారాలు వచ్చేంత వరకు వీరికి రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందివ్వనున్నారు. దీనిని ఆయుష్మాన్ భారత్ కింద అందించనున్నారు. దీనిక అయ్యే ప్రీమియాన్ని పీఎం కేర్స్ చెల్లించనుంది.

Also Read: Varun Gandhi: బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ తొలగింపు

Passenger Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు

Snake Bite Murders: రాజస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోయిన పాము కాటుతో హత్యలు.!

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..