Viral Video: స్కూల్ ప్రాజెక్ట్‌లో దేశీ వాషింగ్ మెషిన్‌ను తయారు చేసిన స్టూడెంట్.. వీడియో వైరల్
Viral Video: భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. అవకాశం ఇస్తే.. సృజనాత్మక ప్రతిభావంతులైన వ్యక్తులు అద్భుతాలు సృష్టించగలరు. ఓ బాలుడు ప్రతిభకు..
Viral Video: భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. అవకాశం ఇస్తే.. సృజనాత్మక ప్రతిభావంతులైన వ్యక్తులు అద్భుతాలు సృష్టించగలరు. ఓ బాలుడు ప్రతిభకు అద్దంపట్టే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాన్యులకు, మధ్యతరగతి వారికి ఇప్పటికీ వాషింగ్ మిషన్ ఖరీదు అందుబాటులో లేదని చెప్పవచ్చు. దీంతో వారు ఎంత పని ఉన్నా.. ఉద్యోగం వంటి విధులు నిర్వహిస్తున్నా తప్పనిసరిగా బట్టలను ఉతకడానికి చేతులను ఆశ్రయించాల్సిందే. అయితే ఇలాంటివారి కోసం ఒక యువకుడు స్వయంగా ఓ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశాడు. ‘ జుగాద్’ టైమ్ -టెస్టెడ్ కాన్సెప్ట్ ఉపయోగించి రూపొందించాడు.
ఒక స్కూలు బాలుడు తన స్కూల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక వాషింగ్ మెషిన్‌ను సృష్టించాడు. ఆ వాషింగ్ మెషిన్ బట్టలను చక్కగా ఉతుకుతుంది. వాషింగ్ మెషిన్ తయారీకి సైకిల్ పెడల్‌లను ఉపయోగించాడు. వెనుక భాగంలో పెద్ద డ్రమ్‌లో మెషినరీ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసాడు. వీడియో ద్వారా వాషింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో బట్టలను వేసి ఉతికి మరీ చూపించాడు. బట్టలను ఉతికే సమయంలో ఆ బాలుడు దగ్గర ఇతర పాఠశాల పిల్లలు చుట్టుముట్టారు.
మొదట వాషింగ్ మెషిన్ లో డిటర్జెంట్ పౌడర్ వేశాడు. తరవాత ఒక మురికి ఉన్న క్లాత్ ను వేసి తర్వాత సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాల తర్వాత.. వస్త్రాన్ని బయటకు తీస్తే.. అది చక్కగా శుభ్రంగా ఉంది. ఈ వీడియో స్టోరీ 4 మీమ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ‘దేశీ వాషింగ్ మెషిన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ప్రస్తుతం బాలుడు సృజనాత్మకతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
Also Read: రెస్క్యూ టీమ్ మధ్య క్యూట్ క్యూట్‌గా గున్న ఏనుగు.. తల్లిదగ్గరకు చేరిన వీడియో వైరల్