Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చాంతాడంత పొడవున్న నాగుపాము… సింపుల్‌గా నీరు తాగించిన యువకుడు.. షాకింగ్ వీడియో

మనలో చాలా మందికి చిన్న పామును చూస్తేనే వణుకు పుడుతోంది. అదే భారీ విష సర్పం అయితే  పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే అక్కడ నుంచి లగెత్తుతారు.

Viral Video: చాంతాడంత పొడవున్న నాగుపాము... సింపుల్‌గా నీరు తాగించిన యువకుడు.. షాకింగ్ వీడియో
Snake Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2021 | 7:29 PM

మనలో చాలా మందికి చిన్న పామును చూస్తేనే వణుకు పుడుతోంది. అదే భారీ విష సర్పం అయితే  పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే అక్కడ నుంచి లగెత్తుతారు. కొంచెం ధైర్యం ఉన్నవారు అయితే ఆ పామును మట్టుబెడతారు. కానీ, ఒక యువకుడు దాహంతో ఉన్న భారీ నాగుపాముకు నీరు అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనుషులలాగా తెలివితేటలు లేని, తమ బాధను వ్యక్త పరచలేని జీవుల పట్ల దయ చూపడం ఎంతైనా అవసరం. అలాంటి పని చేసిన సదరు యువకుడ్ని ఇప్పుడు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వాతావరణంలో వేడిమి కారణంగా ఓ భారీ సర్పం బాగా దాహంతో ఉంది. అది చాలా సేపటి నుంచి నీళ్లు లేక అలమటించింది. ఈ క్రమంలో ఓ కాలనీ వైపు వచ్చింది. మిగతా వారందరూ దాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఓ యువకుడు మాత్రం దాని బాధను అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి బకెట్‌లో నీటితో నింపి సదరు పాముకు తాగించాడు. తాపం తగ్గిందేకు దానిపై కూడా నీళ్లు పోశాడు. ఈ సమయంలో పాము దూకుడుగా ప్రవర్తించలేదు. ఈ వీడియో ఏ ప్రాంతంలో చిత్రీకరించారో తెలియదు కానీ.. నెట్టింట వైరల్ అవుతోంది. పాముకి సహాయం చేసినందుకు ఆ వ్యక్తికి నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ.. మరోసారి ట్రెండ్ అవ్వడం గమనార్హం.

వీడియో వీక్షించండి

అయితే నిపుణుల మాత్రం పాములు సాధారణంగా అలా నీరు తాగవని చెబుతున్నారు. వాటి తల కింద భాగాన్ని నీటిలోకి తాకించడం వల్ల ఆ చర్మపు పొరల గుండా మాత్రమే పాముల ఆహార వాహికలోకి క్యాపిల్లారిటీ అనే ధర్మం వల్ల నీరు ప్రవేశిస్తుందని వెల్లడించారు. ఇది కూడా అరుదుగానే జరుగుతుందని.. సహజంగా తినే కప్పలు, ఎలుకలు, ఇతర ఆహార జీవుల్లో ఉండే నీటితోనే పాములు సర్దుకుపోతాయని వివరిస్తున్నారు. 

Also Read: Viral Photo: తస్సాదియ్యా.. ఏమి ఐడియా గురూ… నెట్టింట ట్రెండింగ్

దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి