Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTA: అలా చేస్తే బస్సులు సీజ్ చేస్తాం.. ప్రైవేట్ ట్రావెల్స్‎కు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆంధ్రప్రదేశ్ ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రయాణికుల వద్ద టికెట్‎కు అధిక ధరల వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు...

RTA: అలా చేస్తే బస్సులు సీజ్ చేస్తాం.. ప్రైవేట్ ట్రావెల్స్‎కు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక..
Bus
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 07, 2021 | 8:08 PM

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆంధ్రప్రదేశ్ ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రయాణికుల వద్ద టికెట్‎కు అధిక ధరల వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దసరా పండుగ సెలవులు నేపథ్యంలో టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నట్లు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ఫిర్యాదులు అండటంతో ఆర్టీఏ అధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ట్రావెల్స్ యాజమాన్యాలతో సమావేశమై కృష్ణా జిల్లా డీటీసీ పురేంద్ర యాజమాన్యాలతో మాట్లాడారు. అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులు సీజ్ చేస్తామన్నారు. ప్రధాన కూడళ్లలో బస్సుల తనిఖీలు చేపడతామన్నారు.

ఇటు తెలంగాణలోనూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏపీకి వెళ్లే బస్సులను తనిఖీ చేస్తున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‎పేట ఓఆర్ఆర్​వద్ద బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్ని 5 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Read Also.. YouTube: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. యూ ట్యూబ్ చూసి ఆ పని చేద్దామనుకున్నాడు.. కానీ..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!