Viral Video: చేపలు పడుతోన్న చిన్నారి.. ఎటాక్ చేసిన మొసలి.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు!

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు సమయం దొరికినప్పుడల్లా చేపలు పడుతుంటారు. కొన్నిసార్లు కొంతమంది ఫిషింగ్‌కు తమ వెంట పిల్లలను...

Viral Video: చేపలు పడుతోన్న చిన్నారి.. ఎటాక్ చేసిన మొసలి.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 06, 2021 | 1:12 PM

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు సమయం దొరికినప్పుడల్లా చేపలు పడుతుంటారు. కొన్నిసార్లు కొంతమంది ఫిషింగ్‌కు తమ వెంట పిల్లలను సైతం తీసుకెళ్తుంటారు. చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తుంటారు. ఇక ఇలాంటి ఆలోచన మెక్‌మహాన్ అనే వ్యక్తికి వచ్చింది. ఆలోచన వచ్చిందే తడువుగా తన కొడుకును కూడా చేపల వేటకు తీసుకెళ్లాడు మెక్‌మహాన్. కానీ అక్కడ వారి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ తండ్రీకొడుకులు చేపలు పడుతుంటే మొసలి అనుకోని అతిధిగా వచ్చి పలకరించింది. దీనితో వారికి ఒక్కసారిగా షాక్ తగిలింది. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ నది ఒడ్డుకు మెక్‌మహాన్ తన 7 ఏళ్ల కుమారుడు డాసన్‌తో కలిసి చేపల వేటకు వెళ్లాడు. అక్కడ తన కొడుకు గాలం వేసి చేపల పట్టడాన్ని చూసి ముచ్చటపడిన మెక్‌మహాన్.. అదంతా వీడియో తీస్తున్నాడు. ఇక వారిద్దరికీ కూడా అక్కడ ఓ మొసలి ఉందని తెలియదు. డాసన్ గాలానికి ఓ చేప చిక్కింది. ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేవు. తండ్రి సలహాలు తీసుకుంటూ గాలాన్ని తిప్పుతున్నాడు. ఆ చేపను ఒడ్డుకు లాగాడు.

అయితే అప్పుడే ఊహించని విధంగా ఓ మొసలి మెరుపు దాడికి దిగింది. ఆ చేపను తన పదునైన దవడలతో పట్టుకుని నమిలేసింది. ఇక అది చూసిన డాసన్ భయంతో గాలాన్ని అక్కడే పడేసి వెనక్కి పారిపోయాడు. కాగా, 50 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటివరకు 1.99 లక్షల మంది వీక్షించారు. అలాగే ఈ వీడియో 2.7 వేల లైకులు సంపాదించింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read:

మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!