Post Office Scheme: రూ. 100 పెట్టుబడి పెడితే.. ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు..
వచ్చిన ఆదాయంలో కొంత డబ్బు పొదపు చేయాలనుకుంటారు చాలా మంది. మరి ఆ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి? ఎక్కడ భద్రత ఉంటుంది?.. భద్రతతోపాటు మంచి రిటర్న్స్ ఇచ్చే పథకాలను పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది...
వచ్చిన ఆదాయంలో కొంత డబ్బు పొదపు చేయాలనుకుంటారు చాలా మంది. మరి ఆ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి? ఎక్కడ భద్రత ఉంటుంది?.. భద్రతతోపాటు మంచి రిటర్న్స్ ఇచ్చే పథకాలను పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. ఇందులోని నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) పథకం ఒకటి. దీని ద్వారా కేవలం రూ .100 పెట్టుబడి పెట్టి మీరు ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు. అదెలాగంటే..
NSC ఒక స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. మీరు ఎన్‌ఎస్‌సీ పథకం యొక్క ఖాతా ఏదైనా పోస్ట్ ఆఫీస్ శాఖతో తెరవవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకం యొక్క గడువు ఐదేళ్లు ఉంటుంది. మీకు కావాలంటే మీరు ఒక సంవత్సరంలోపు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇందులో పెట్టుబడికి ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.
మీరు ఈ పథకంలో నెలకు కేవలం 100 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఈ పథకం వార్షికంగా 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సెక్షన్ 80 సీ కింద 1.5 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు ఐదేళ్ల వ్యవధి తర్వాత 6.8 శాతం వడ్డీతో రూ. 20.58 లక్షలు సంపాదించాలనుకుంటే.. ఈ ఐదేళ్ల వ్యవధిలో రూ .15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Read Also.. PM Kisan: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..!