- Telugu News Photo Gallery Business photos Bamboo Plants: farmer cultivated bamboo plants and earns more rs 17 lakhs over 7 years
Bamboo Plants: ఏడేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఇంతకీ ఏం పండించాడంటే..!
Bamboo Plants: డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. తాను పెట్టిన పెట్టుబడికి 7 సంవత్సరాల్లో అక్షరాల..
Updated on: Oct 06, 2021 | 8:44 AM

Bamboo Plants: డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. తాను పెట్టిన పెట్టుబడికి 7 సంవత్సరాల్లో అక్షరాల 4 రెట్ల లాభం పొందాడు ఓ రైలు. కేవలం వ్యవసాయం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి చెందిన సాకేతు గ్రామంలో నివసిస్తున్న 65 యేళ్ల సురేశ్ చంద్ర వర్మ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నాడు. వ్యవసాయం పట్ల మక్కువ కలిగిన వర్మ తన భూమిలో రకరకాల పంటలను పండించడం మొదలు పెట్టాడు. చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించడంలో ఆయన దిట్ట. అంతేకాకుండా మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి ఉద్యాన పంటల సాగులోనూ ఆయనకు సాటే లేరు. అంతర పంటల ద్వారా కూడా అధిక లాభాలను పొందాడు.

నాలుగేళ్ల క్రితం పంత్‌నగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి 234 వెదురు మొక్కలను కేవలం రూ. 25 ల చొప్పున కొనుగోలు చేసి ఎకరం భూమిలో నాటాడు. అయితే ఈ నాలుగు సంవత్సరాలలో ఒక మొక్క 20 నుంచి 25 వెదురు బొంగులను ఉత్పత్తి చేసింది. అంతేకాకుండా మూడేళ్లపాటు సహపంటగా చెరకును కూడా దీనితో పాటుగా పండించాడు. నాలుగో సంవత్సరం నుంచి మాత్రం కేవలం వెదురును మాత్రమే కొనసాగించాడు.

ఈవిధంగా ప్రతి మొక్కకు 40 నుంచి 50 వరకు వెదురు వచ్చే అవకాశం ఉంది. పల్లెటూరులో ఒక వెదురు బొంగు రూ.150ల ధర పలుకుతుంది. ఈ విధంగా ప్రతి మొక్కకు 50 వెదుర్లు ఉత్పత్తి అయితే 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదుర్లు వస్తాయి. ఒక వెదురును రూ.150లకు అమ్మితే మొత్తంగా రూ. 17 లక్షల 55 వేలు లాభం వస్తుంది. ఇలా తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదిస్తూ అందరి దృష్టి పడేలా చేస్తున్నాడు ఆ రైతు.





























