Hyderabad: అనుకోని ప్రమాదం.. అందరు చూస్తుండగానే.. బాణాసంచా లారీ అగ్నికి ఆహుతి..!
టపాసులు ఎంత డేంజరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఎందుకంటే.. టపాసులు ఎప్పుడు.. ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తాయో చెప్పలేము.. తయారీ కేంద్రంలో బ్లాస్ట్ అవ్వచ్చు.. గోడౌన్లలో.. ఇళ్లలో నిల్వ చేసినా పేలవచ్చు.. చివరికి వాహనాల్లో తీసుకెళ్తున్నప్పుడు కూడా.. అనుకోని ప్రమాదాలు జరిగి పేలుడు సంభవించవచ్చు.. అందుకే.. బాణాసంచా అంటేనే భయపడాల్సి వస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

హైదరాబాద్ మహానగరం శివారు రంగారెడ్డి జిల్లా కొత్తూరులో అనుకోని ప్రమాదంతో బాణాసంచా లారీ అగ్నికి ఆహుతి అయింది. టపాసులతో వెళ్తున్న లారీకి కొత్తూరు మాణిక్యమ్మ గూడా దగ్గర హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే.. మంటలు భారీగా వ్యాపించి.. లారీ పూర్తిగా దగ్ధమైంది. వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించడం కలకలం రేపింది. లారీలోని టపాసులు పెద్దపెద్ద శబ్దాలతో పేలడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు రేగాయి. టపాసుల శబ్దాలతో సమీపంలోని రైతులు భయంతో పరుగులు తీశారు. భారీ సౌండ్స్‌తో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కొత్తూరు ఫైర్ సిబ్బంది.. అతి కష్టం మీద మంటలు ఆర్పివేశారు.
ఇక.. మంటలు ఆర్పిన తర్వాత.. లారీ ఎలా ఉందో ఒక్కసారి గమనిస్తే.. టపాసుల లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమై.. కళావిహీనంగా మారింది. లారీ టైర్లు, బాడీ పార్ట్స్ అన్నీ కాలిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… అగ్ని ప్రమాదంతో పూర్తిగా కాలిపోయి.. అస్థిపంజరం మాదిరిగా దర్శనమిస్తోంది.
ఇక.. ఈ లారీ.. తమిళనాడులోని శివకాశి నుంచి టపాసుల లోడుతో హైదరాబాద్ వస్తోంది. అయితే.. హైవే మీదుగా వెళ్లాల్సిన లారీ.. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో.. లారీ డ్రైవర్ రూట్ మార్చుకుని.. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం నుంచి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. హైటెన్షన్ విద్యుత్ తీగలు లారీకి తగలడంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించకుండా డ్రైవర్.. లారీని కొద్ది దూరం అలాగే పోనివ్వగా.. టపాసులు పేలిన శబ్దాలతో వెంటనే ఆపి డ్రైవర్, క్లీనర్ పరుగులు తీశారు. అంతలోనే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..