AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

బరువు తగ్గడం అంటే ఒక యుద్ధం లాంటిది. రకరకాల ఆహార నియమాలు, కఠినమైన వ్యాయామాలు చేసి మధ్యలోనే వదిలేసే వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు 2026లో ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త డైట్ ట్రెండ్ నడుస్తోంది. అదే 'CPB డైట్'. వినడానికి చాలా బోరింగ్‌గా ఉన్నా, ఫలితాల్లో మాత్రం ఇది 'సూపర్ హిట్' అనిపించుకుంటోంది. కేవలం చికెన్, బంగాళాదుంపలు, బ్రోకలీలతో మీ శరీరాన్ని ఎలా స్లిమ్‌గా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..
Cpb Diet Plan
Bhavani
|

Updated on: Mar 21, 2026 | 6:01 PM

Share

చికెన్, పొటాటోస్, బ్రోకలీ.. ఈ మూడింటి కలయికే CPB డైట్. ఇది చదవడానికి ఎంత సులభంగా ఉందో, పాటించడం కూడా అంతే సులభం. ఎటువంటి జంక్ ఫుడ్ లేకుండా, కేవలం ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ ఆహారం శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఒకే రకమైన ఆహారం తినడం వల్ల విసుగు రావచ్చు, కానీ నెల రోజుల్లో 5 నుండి 10 కిలోల బరువు తగ్గిన వారి రిపోర్ట్స్ చూస్తుంటే ఇది ఎంత పవర్‌ఫుల్ గా పనిచేస్తుందో అర్థమవుతుంది. మరి ఈ 30 రోజుల ప్లాన్ లో ఏ వారం ఏం తినాలో ఇప్పుడు సవివరంగా విశ్లేషిద్దాం..

CPB డైట్ అంటే ఏమిటి?

ఇందులో ప్రధానంగా మూడు పదార్థాలు ఉంటాయి:

చికెన్ (లేదా టోఫు): శరీరానికి కావాల్సిన హై-క్వాలిటీ ప్రోటీన్ అందిస్తుంది.

బంగాళాదుంపలు: అవసరమైన కార్బోహైడ్రేట్లు శక్తిని ఇస్తాయి.

బ్రోకలీ, క్యారెట్లు: కడుపు నిండుగా ఉంచడానికి కావాల్సిన ఫైబర్ విటమిన్లు అందిస్తాయి.

నియమాలు: వంటకు కేవలం ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడాలి. నీరు, బ్లాక్ కాఫీ లేదా టీ మాత్రమే తాగాలి. స్వీట్లు, శీతల పానీయాలు పూర్తిగా నిషిద్ధం.

30 రోజుల మ్యాజిక్ ప్లాన్:

మొదటి వారం: కేవలం చికెన్, పొటాటో, బ్రోకలీలతో కూడిన బేసిక్ డైట్.

రెండవ వారం: కొద్దిగా పాలకూర లేదా లీన్ మీట్ జత చేయవచ్చు.

మూడవ వారం: డైట్ లో పండ్లు మరియు నట్స్ చేర్చుకోవచ్చు.

నాల్గవ వారం: సాధారణ ఆరోగ్యకరమైన ఆహారానికి శరీరాన్ని అలవాటు చేయడం.

ప్రయోజనాలు vs ప్రతికూలతలు:

ప్రయోజనాలు: వేగంగా బరువు తగ్గడం, ఆహారంపై క్రేవింగ్స్ తగ్గడం, మెరుగైన శక్తి స్థాయిలు.

ప్రతికూలతలు: పదే పదే ఒకే ఆహారం తినడం వల్ల విసుగు రావడం, పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు.

విసుగు రాకుండా ఉండాలంటే చికెన్ లోకి వేర్వేరు సహజ సిద్ధమైన మసాలాలు (మిరియాల పొడి, వెల్లుల్లి, నిమ్మరసం) వాడుకోవచ్చు. దీనివల్ల రుచి మారుతుంది కానీ కేలరీలు పెరగవు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఈ డైట్ పాటించే ముందు మీ శరీర తత్వాన్ని బట్టి వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..