AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SamChaitanya: సమంత-నాగచైతన్య అందుకే దూరమయ్యారు.. మాధవిలత షాకింగ్ కామెంట్స్..

ఇప్పుడు ఎక్కడ చూసిన సమంత, నాగచైతన్య టాపిక్ మాత్రమే నడుస్తోంది. ఏడేళ్ళు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకుని

SamChaitanya: సమంత-నాగచైతన్య అందుకే దూరమయ్యారు.. మాధవిలత షాకింగ్ కామెంట్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Oct 06, 2021 | 2:52 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన సమంత, నాగచైతన్య టాపిక్ మాత్రమే నడుస్తోంది. ఏడేళ్ళు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకుని వివాహం చేసుకుని ఒకటయ్యారు సామ్, చైతూ.. కానీ అనుహ్యాంగా అక్టోబర్ 2న తాము విడాకులు తీసుకున్నట్లుగా సామ్, చైతూ ప్రకటించడంతో సినీ ప్రముఖులతోపాటు.. అభిమానులు సైతం షాకయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఇలా ఆకస్మాత్తుగా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. అయితే తాము విడిపోవడానికి కారణాలు సమంత, చైతన్య చెప్పకపోయిన.. నెట్టింట్లో వారిపై రూమర్స్ మాత్రం ఆగడంలేదు. ఎవరికి నచ్చినట్లుగా వారు సమంత, నాగచైతన్య విడాకుల కారణాలను అంచనాలు వేసేస్తున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఫేస్‏బుక్ లైవ్‏లోకి వచ్చిన మాధవిలత.. సామ్, చై విడాకు విషయంపై మాట్లాడుతూ.. చాలా మంది సమంత కారణంగానే విడాకులు వచ్చాయని.. ఆమెను తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు. సామ్ చాలా మంచి అమ్మాయి. ముఖ్యంగా ఆమె వేసుకున్న దుస్తుల కారణంగానే విడాకుల దాకా వెళ్లింది అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు.. ఐశ్యర్య రాయ్, దీపికా పదుకొనే లాంటి వాళ్లు కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు. అందుకని వాళ్ల భర్తలు వదిలిపెట్టారా ? అని మాధవిలత అన్నారు. సమంత హిందూ దేవుళ్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆమె హిందూ దేవుళ్లను గౌరవిస్తుంది. ఆమె తిరుపతి మెట్లు ఎక్కి తన తాళిని కళ్లకద్దుకుంది.. దీన్ని బట్టి చెప్పొచ్చు.. ఆమె వివాహబంధానికి ఎంతగా విలువ ఇచ్చిందో చెప్పుకొవచ్చు.

అలాగే సమంత డబ్బు మనిషి కాదని… తను ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేసి వారి ప్రాణాలను కాపాడిందని చెప్పుకొచ్చింది. అలాగే గతంలోనూ ఓ హీరో ఉచ్చులో పడి సమంత చాలా కష్టాలు పడిందని చెప్పారు. అలాగే తాను తల్లి కావాలని అనుకుందని.. కానీ అలా కాకుండా.. సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Also Read: ‘మా’ అసోసియేషన్ నడపడానికి బయటవాళ్లు కావాలా.. రవిబాబు సంచలన కామెంట్స్..

Konda Polam: నేను కాకపోతే ఆ స్టార్ డైరెక్టర్ ‘కొండపోలం’ సినిమా చేసేవారే.. ఆసక్తికర విషయం చెప్పిన క్రిష్..