AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఇక మీదట సమంత ఉండబోయేది అక్కడేనట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ నిజమేనా ?

సమంత.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరే. అక్టోబర్ 2 నుంచి సోషల్ మీడియాలో నిత్యం సమంతకు సంబంధించిన వార్తలు హల్‏చల్

Samantha: ఇక మీదట సమంత ఉండబోయేది అక్కడేనట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ నిజమేనా ?
Samantha 1
Rajitha Chanti
|

Updated on: Oct 06, 2021 | 8:32 PM

Share

సమంత.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరే. అక్టోబర్ 2 నుంచి సోషల్ మీడియాలో నిత్యం సమంతకు సంబంధించిన వార్తలు హల్‏చల్ చేస్తున్నాయి. ఏమాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‏గా మారింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. అంతేకాకుండా.. అక్కినేని నాగార్జున్ తనయుడు నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‏లో సెటిల్ అయింది. ఏమాయ చేసావే సినిమాతో మొదలైన వీరిద్దరి స్నేహం.. ప్రేమగా మారి.. వివాహ బంధం వరకు కొనసాగి.. ఇటీవల ముగింపు పలికింది. ఏడేళ్లు ప్రేమించుకున్న వీరిధ్దరు 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్‏గా ఉన్న సామ్, చైతూలకు అభిమానులు ఎక్కువే ఉన్నారు.

అయితే గత కొద్దిరోజులుగా సామ్ , చైతన్య విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ అక్టోబర్ 2న తాము విడాకులు తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు సమంత. దీంతో సామ్, చై అభిమానులతోపాటు.. సినీ ప్రముఖులు కూడా షాకయ్యారు. ఇక విడాకుల ప్రకటన అనంతరం సైలెంట్ అయిపోయాడు చైతూ.. కానీ.. సమంత మాత్రం తన మనసులో ఉన్న పదాలను.. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… గత కొద్ది రోజులుగా సమంత ముంబైలో ఇల్లు కొనిందని.. త్వరలోనే అక్కడికి మకాం మార్చనున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అవి నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. తాను హైదరాబాద్‏లోనే ఉండబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సామ్ ఉండేది ఎక్కడా అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో సమంత గచ్చిబోలిలోని ఓ ప్లాట్ కు షిఫ్ట్ కానుందని.. ఇకపై అక్కడే ఒంటరిగా నివసిస్తుందని నెట్టింట్లో టాక్. ఇక ఇటీవల హైదరాబాద్ తనకు ఎన్నో ఇచ్చిందని, ఇదే తన హోమ్ టౌన్‌.. ఇప్పటికీ, ఎప్పటికీ అని చెప్పింది. ఇక ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read:  ఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు దక్షిణాదిలోనే సూపర్ స్టార్.. ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాకవుతారు..

Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..