MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..

మా ఎన్నికల ప్రభావంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లొసుగులన్ని బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మేమంతా ఒక్కటే అన్నట్లుగా

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..
Nagababu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2021 | 6:01 PM

మా ఎన్నికల ప్రభావంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లొసుగులన్ని బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మేమంతా ఒక్కటే అన్నట్లుగా ఉన్న సినీ పరిశ్రమలో ఇప్పుడు గ్రూపులు.. విభేదాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న విమర్శలు, ఆరోపణల స్థాయి.. ఇప్పుడు ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో హీట్ పెరిగింది. మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రచార వేగాన్ని పెంచిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

ఈ మాటల యుద్ధం చినికి చినికి గాలి వానగా మారి.. ఫిర్యాదుల వరకు వెళ్లింది. తప్పుడు దారిని అవలంభిస్తున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్లింది. ఇక వరుస మీడియా సమావేశాల.. విమర్శలు, ఆరోపణలతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఫిర్యాదులు ఇండస్ట్రీలో కాకపెంచగా.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక మొదటి నుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్‏కు మద్దతిస్తున్న నాగబాబు.. ఇటీవల ప్రకాష్ రాజ్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తాను ఒక మాట విన్నానని.. అది నిజమా.. అబద్ధమా తనకు తెలియదని.. ఆర్టిస్టులకు మొదటి సారి మా సెక్షన్ మెంబర్స్‏కు డబ్బు ఆశ చూపిస్తున్నారని.. అది నిజమా, కాదా తనకు తెలియదన్నారు. గతంలో మా అసోసియేషన్ మాసకబారిపోయింది అన్నాను.. కానీ ఇప్పుడు మా మాసకబారబోతుంది.. మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. కానీ మీరు అలాంటి ప్రలోభాలకు లొంగిపోకండి.. ప్రకాష్ రాజ్ లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు.. ప్రకాష్ రెండు సంవత్సరాలు కాదు.. మూడు తరాలకు ఉంటే గానీ.. మా అసోసియేషన్ పోజిషన్ టాప్ లెవల్ కు వెళ్లదన్నారు నాగబాబు.. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ దమ్మున్నవాడని తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు. సినిమాకు కోటి రూపాయలు తీసుకునే వ్యక్తి.. డబ్బు వదులుకుని మా కోసం వచ్చాడని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్‌ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాశ్ రాజ్ కావాలని.. అతడు ఉత్తమ నటుడు అన్నది ప్రపంచానికి తెలిసిన విషయమే అన్నారు.  ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ట్వీట్..

గత ఆదివావరం ప్రకాశ్‌ రాజ్‌ ఫ్యానల్‌తో నాగబాబు భేటి అయ్యారు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఫీల్‌ అవుతున్నారు. మనది చిన్న అసోసియేషన్‌.. ఒకే వ్యక్తి ఉన్న బ్యాడ్‌ హ్యబిట్‌ వల్ల జనంలోకి వెళ్లవలసి వచ్చింది. తుమ్మతే, దగ్గితే ప్రెస్‌ మీట్‌ అంటున్నారు. నరేశ్‌ ప్రెండ్‌ అయిన ఏది మాట్లాడితే అది మాట్లాడితే బాగుండదు.. నేను బిజెపి సానుభూతిపరున్ని.. ప్రకాశ్‌రాజ్‌ కమ్యూనిస్ట్‌ భావజాలం కలిగి ఉన్నవాడు.. గ్రేటిస్ట్‌ ఆర్టిస్ట్.. దేశం గర్వించదగిన నటుడు అంటూ చెప్పుకొచ్చారు. నా కన్న ఎక్కువగా మా అన్నయ్య చిరంజీవికి క్లోజ్‌… మా అన్నయ్య క్లోజ్‌ అయిన వ్యక్తి నాకు క్లోజ్‌.. మా అన్నయ్య చిరంజీవి మా ఎన్నికల్లో నువ్వు ఎవరికైనా మాట ఇచ్చావా అన్నాడు లేదు అని చెప్పాను.. ప్రకాశ్‌ రాజ్‌ వస్తున్నాడు మద్దతు ఇవ్వన్నాడు.. అనుభవజ్ఞుడు, తెలివైన వాడు వస్తానంటే స్వాగతించాను. నేను వచ్చి సర్వీసు చేస్తాను అన్న ప్రకాశ్‌రాజ్‌ ఒకకైండ్‌ఆఫ్‌ యాక్టివిస్ట్‌ అందుకే నచ్చుతుంది.. చిన్న, పెద్ద సినిమాలు తీసేవాళ్లకు ప్రకాశ్‌రాజ్‌ కావాలి కూరలో సాల్ట్‌ లాంటి వాడు అందరికీ కావాలి అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ భారతీయ నటుడు, తెలుగులోడా, కన్నవాడ అని అంటారా? భారతీయ నటుడు ప్రకాశ్‌రాజ్‌

దేశంలో ఉన్న అన్ని బాషల్లో ప్రకాశ్‌రాజ్‌ నటించాడు. బిజెపి ప్రభుత్వం ఐడలాజికల్‌ డిపరెన్స్‌ ఉండొచ్చు కానీ మాకు ఏమైనా కావాలంటే మోదీ, అమిత్‌ షామాట్లాడి ఏదైనా తేగలగుతాడు.. మీ ఫ్యానల్‌కు ఆ దమ్ముందా ? తెలుగువాడు కాదు, తెలుగు సినిమాలు అవసరమా ? సంకుచితంగా ఎందుకు మాట్లాడుతారు. వయసు వచ్చే కొద్ది సంకుచితంగా మారిపోవద్దు. తెలుగోడు కాదని ప్రకాశ్‌రాజ్‌గారిని అంటారా ? ప్రకాశ్‌రాజ్‌ గురించి కోటశ్రీనివాస్‌రావు, బాబు మోహన్‌రావు లాంటి వాళ్లు జలసీ, అసూయతో మాట్లాడారు అని తెలిపారు నాగబాబు. తాము వంద శాతం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ఇస్తామని.. కల్యాణ్‌ బాబు వైపు ఉంటావా, ఇండస్ట్రీ వైపు ఉంటావా అని విష్ణు ఏలా అడుగుతాడని.. పవన్‌ కల్యాణ్‌ తెలుగోడు కాదా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Allu Arjun: వెంకటేష్ సినిమా సెట్‏లో అల్లు అర్జున్ సందడి.. చిత్రయూనిట్‏తో బన్నీ ముచ్చట్లు..

Faria Abdullah: నడి రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసిన చిట్టి.. జాతిరత్నాలు బ్యూటీ ఫరియా డ్యాన్స్ అదుర్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!