Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: వెంకటేష్ సినిమా సెట్‏లో అల్లు అర్జున్ సందడి.. చిత్రయూనిట్‏తో బన్నీ ముచ్చట్లు..

కరోనా సెకండ్ వేవ్ అనంతరం సినిమా షూటింగ్స్ వేగం పెరిగింది. ఇప్పటివరకు వాయిదా పడిన చిత్రాలను సాధ్యమైనంత

Allu Arjun: వెంకటేష్ సినిమా సెట్‏లో అల్లు అర్జున్ సందడి.. చిత్రయూనిట్‏తో బన్నీ ముచ్చట్లు..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2021 | 5:09 PM

కరోనా సెకండ్ వేవ్ అనంతరం సినిమా షూటింగ్స్ వేగం పెరిగింది. ఇప్పటివరకు వాయిదా పడిన చిత్రాలను సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు బిజీ బిజీగా షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోలు సైతం వరుస ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ డైరెక్షన్‏లో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సునీల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. బన్నీ, రష్మిక మందన్నా సైతం పుష్ప సినిమా కోసం తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‏కు పుష్ప షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికింది. దీంతో ఆయన ఎఫ్ 3 మూవీ సెట్‏లో కనిపించారు. వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‏లో జరుగుతుంది. తాజాగా ఎఫ్ 3 షూటింగ్ జరుగుతున్న సమయంలో బన్నీ ఆకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. వెంకటేష్, వరుణ్ తేజ్‏తోపాటు.. చిత్రయూనిట్‏తో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Keerthy Suresh Photos: ఎర్రచీరలో అందాలను ఎరగా వేస్తున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఫొటోస్..

MAA Election: ‘మా’ ఎన్నికల్లో మరో అలజడి.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి.. ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు!

Maa Elections 2021: తెలంగాణ బిడ్డలను గెలిపించండి.. అతడిని మాత్రం ఓడించండి.. సీవీఎల్ సంచలన కామెంట్స్..