Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunisith: ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పిన ‘శాక్రిఫైజ్ స్టార్‌’ సునిశిత్..

‘శాక్రిఫైజ్ స్టార్‌’.. సునిశిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పబ్లిసిటీ కోసమో లేక మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ.. ఇంటర్వ్యూల్లో...

Sunisith: 'మా' ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పిన ‘శాక్రిఫైజ్ స్టార్‌’ సునిశిత్..
Sacrifice Star Sunishith
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 06, 2021 | 9:50 PM

‘శాక్రిఫైజ్ స్టార్‌’.. సునిశిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పబ్లిసిటీ కోసమో లేక మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ.. ఇంటర్వ్యూల్లో సినీ హీరోలు, దర్శకులు, హీరోయిన్ల గురించి సునిశిత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. తన సినిమాలు బడా హీరోలు లాగేసుకున్నారని చెబుతాడు. హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లు చాటింపేసుకుంటాడు. సోషల్ మీడియా వేదికగా స్టార్ల గురించి పిచ్చి.. పిచ్చి కామెంట్లు పెడుతూ.. వారి ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ ఉంటాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఇతడిపై కేసు పెట్టింది. ఫేక్ వీడియోలను సృష్టించి ఓ పోలీసు అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసిన కేసులో ఇటీవల కూడా పీఎస్‌కి వెళ్లి వచ్చాడు. ఇన్ని జరిగినా ఇతగాడి వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ‘మా’ ఎన్నికల వ్యవహారంపై తన మార్క్ కామెంట్స్ చేశాడు సునిశిత్.

“‘మా’ ఎన్నికల్లో నా మద్దతు ఎవరికీ అని అందరూ అడుగుతున్నారు.. గతంలో నేను చెయ్యాల్సిన సినిమాలు మంచు విష్ణు లాక్కున్నాడు, నా తరవాత చిత్రంలో విలన్ పాత్ర కి ప్రకాష్ రాజ్ అనుకున్నాం కానీ ఆయన వ్యవహార శైలి నచ్చక వద్దు అని చెప్పేశా ప్రొడ్యూసర్లకు! కాబట్టి నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు!!” అని తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫోస్ట్ పెట్టాడు. దీంతో అతడిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

జనగామ జిల్లాకు చెందిన ఆర్‌.సునిషిత్‌(32) ఎంటెక్‌ చదివి ఓ కాలేజీలో లెక్చరర్‌గా వర్క్ చేశాడు. ఆ సమయంలో ఓ విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించి ఊచలు లెక్కబెట్టాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత 2014లో రాంపల్లి ఆర్‌ఎల్‌నగర్‌కి మకాం మార్చి ఓ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా జనాల్లో పబ్లిసిటీ తెచ్చుకున్నాడు.

Also Read: ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ అమలుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే మహిళల ఖాతాల్లో నగదు జమ

బట్టలకొట్టు పాండురంగయ్య.. ఏకంగా 90 కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టాడు.. ఎంతమంది బలయ్యారో తెలిస్తే షాకే