Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టలకొట్టు పాండురంగయ్య.. ఏకంగా 90 కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టాడు.. ఎంతమంది బలయ్యారో తెలిస్తే షాకే

భారీగా ముంచాలని డిసైడయ్యాడు. అప్పటివరకు ఉన్న మంచిపేరుతో చుట్టుప్రక్కల గ్రామాల్లో అందినకాడికి డబ్బు తీసుకున్నాడు. ప్రతి నెలా 1వ తేదీన...

బట్టలకొట్టు పాండురంగయ్య.. ఏకంగా 90 కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టాడు.. ఎంతమంది బలయ్యారో తెలిస్తే షాకే
Cloth Merchant Ip
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 06, 2021 | 7:16 PM

భారీగా ముంచాలని డిసైడయ్యాడో లేక వ్యాపారంలో నిజంగా నష్టాలు వచ్చాయో తెలీదు కానీ చాలామందికి మాత్రం ఓ బట్టల వ్యాపారి షాక్ ఇచ్చాడు. అప్పటివరకు ఉన్న మంచిపేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో అందినకాడికి డబ్బు తీసుకున్నాడు. ప్రతి నెలా 1వ తేదీన వడ్డీ ఇచ్చేస్తూ ఉండటంతో.. అందరు తమ డబ్బు సేఫ్ అనుకున్నారు. కానీ వన్ ఫైన్ డే.. దుకాణం క్లోజ్ చేశాడు. ఐపీ పెట్టి జంప్ అయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఓ బట్టల వ్యాపారి అప్పుగా తీసుకున్న సొమ్ము చెల్లించకుండా.. ఎగ్గొట్టాడని బాధితులు ఆందోళన చేపట్టారు. తమ డబ్బు ఇప్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బట్టల వ్యాపారిని అరెస్ట్​ చేయాలని బాధితులు డిమాండ్​ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. పెనుమూరులోని బజారివీధిలో బట్టల వ్యాపారం చేస్తున్న పాండురంగయ్య.. వ్యాపార అవసరాల కోసమంటూ సూమారు రూ. 90 కోట్లు అప్పు చేశాడు. పెనుమూరు, పాకాల, వెదురుకుప్పం, పూతలపుట్టు మండలాలకు చెందిన 998 మంది నుంచి 90 కోట్ల రూపాయల మేర అప్పు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాపార నిర్వహణలో భాగంగా అవసరమైనప్పుడు తమ నుంచి అప్పు తీసుకునేవాడని.. క్రమం తప్పకుండా నెల నెలా వడ్డీ ఇవ్వడంతో నమ్మకం కలిగి నగదు ఇచ్చామని బాధితులు అంటున్నారు. అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడడంతో చిత్తూరు న్యాయస్థానం ద్వారా ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) వేయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.

Also Read: వలపు వల.. వెయ్యితో మొదలైన ట్రాన్సాక్షన్ కోటి 20 లక్షలకు.. కొంప కొల్లేరు

‘క్రూయిజ్‌లో ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదు’.. మహారాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్