Hyderabad: వలపు వల.. వెయ్యితో మొదలైన ట్రాన్సాక్షన్ కోటి 20 లక్షలకు.. కొంప కొల్లేరు
బావామరదళ్లు.. మధ్యలో ఆమె ప్రియుడు కలిసి ఓ వ్యక్తిని నిండా ముంచారు. ఆ అమ్మాయి వలపు వలకి చిక్కి కోటి 20 లక్షలు మోసపోయాడు బాధితుడు.
బావామరదళ్లు.. మధ్యలో ఆమె ప్రియుడు కలిసి ఓ వ్యక్తిని నిండా ముంచారు. ఆ అమ్మాయి వలపు వలకి చిక్కి కోటి 20 లక్షలు మోసపోయాడు గుంటూరు చెందిన ఓ వ్యక్తి. హైదరాబాద్ అంబర్‌పేట పోలీసులు ఆ కిలాడీ లేడీని అరెస్ట్ చేశారు. అర్చన అనే పేరుతో ఫోన్ చేసి గుంటూరు చెందిన బాధితుడిని తన ట్రాప్ లోకి లాగింది ఆ యువతి. వెయ్యి రూపాయలతో మొదలైన ట్రాన్సాక్షన్ కోటి 20 లక్షలకు చేరింది. గత డిసెంబర్ నుంచి ఈ తంతంగం నడిచినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. తాను మోసపోయినట్టు గుర్తించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫోన్లో సరదాగా మాట్లాడి ఆ వ్యక్తిని ఆమె హనీట్రాప్ చేసింది. ఈ మోసానికి ఆ యువతి బావతో పాటు ప్రియుకుడు కూడా సహకరించడం సంచలనం రేపింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా ఈ మధ్యకాలంలో హనీ ట్రాప్‌లు పెరిగిపోతున్నాయి. మత్తెక్కించే మాటలతో కి’లేడీ’లు నిండా ముంచేస్తున్నారు. తేరుకునే సరికి జేబు మొత్తం ఖాళీ అవుతోంది. కొంప కొల్లేరు అయిపోతోంది. కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. పరువు పోతోందని కొందరు బయటకు వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా రావడం లేదు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వలపు వలలో పడితే.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోయాయని.. అలెర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు.
Also Read: ‘క్రూయిజ్‌లో ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు’.. మహారాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్
మందలో ఒకడు కాదు.. వందలో ఒకడిగా నిలిచాడు.. ఆ పోలీసుకు సలాం కొట్టిన జనం.. ఎందుకంటే..