AP Police: మందలో ఒకడు కాదు.. వందలో ఒకడిగా నిలిచాడు.. ఆ పోలీసుకు సలాం కొట్టిన జనం.. ఎందుకంటే..
AP Police: ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు. అది కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
AP Police: ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు. అది కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వారే ప్రజల మన్ననలు పొందుతారు.. ప్రజలచే గౌరవింపబడతారు.. కొనియాడబడతారు.. తాజాగా ఏపీకి చెందిన ఓ పోలీసు అధికారి తన సాహంతో.. ప్రజల నుంచి అభివాదాలు అందుకున్నారు. మందలో ఒకడు కాదు.. వందలో ఒకడు అంటూ ప్రజల చేత కీర్తించబడుతున్నారు. ఆయన సేవలు మరువరానివి, మర్చిపోలేనివి అంటూ పొగడ్తలవర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఏం చేశారు? ప్రజలెందుకు అంతలా ప్రశంసలు కురిపిస్తున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఓ తల్లి, తన కొడుకు, కూతురుతో కలిసి పోలవరం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, అది గమనించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న జగ్గంపేట సీఐ వి సురేష్ బాబు, ఎస్ఐ లక్ష్మి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి వెళ్లారు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురిని చూసి సీఐ సురేష్ బాబు వెంటనే కాలువలోకి దూకారు. తన ప్రాణాలకు తెగించి.. తల్లి, కుమారుడిని బయటకు తీసుకువచ్చారు.
అయితే, బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన సీఐ సురేష్ బాబు.. ఓ క్రమంలో నీటిలో మునిగిపోయారు. అదృష్టావశాత్తు మళ్లీ పైకి రావడం, కాలువ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. కాలువ నుంచి బయటకు తీసిన వారిలో బాలుడు స్పహలో ఉండగా, తల్లి మాట్లాడే స్థితిలో లేదు. అయితే కూతురు గల్లంతు అవగా.. ఆ చిన్నారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. బాలుడు, తల్లిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరి ఆత్మహత్యాయత్నానికి కారణమేంటి? వీరు ఎక్కడివారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఆత్మహత్య చేసుకునేందుకు పోలవరం కాలువలో దూకిన కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించి కాపాడిన జగ్గంపేట సీఐ సురేష్ బాబుపై స్థానిక ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పీకల్లోతు నీటిలో మునిగిపోతూ కూడా బాధితులను రక్షించిన విధానాన్ని కొనియాడుతున్నారు. ఆయన ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇదొక్కటే కాదు.. సామాన్యులకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారని, ఆయన చేస్తున్న సేవలు మర్చిపోలేని, మరవరాని సేవలని స్థానిక ప్రజలు అంటున్నారు. మరి ఈ సీఐకి మనమూ సెల్యూట్ చేద్దాం.
*తూ.గో. జిల్లా, జగ్గంపేట.*
ఆత్మహత్య చేసుకునేందుకు పోలవరం కాలువలో దూకిన కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించి కాపాడిన జగ్గంపేట సీఐ సురేష్ బాబు.
తల్లి తన కొడుకు, కూతురుతో పాటు పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. ఈ విషయమై తెలుసుకున్న జగ్గంపేట(1/3)@dgpapofficial @APPOLICE100 pic.twitter.com/V9I1c4TiHS
— East Godavari Police, Andhra Pradesh (@EGPOLICEAP) October 5, 2021
కాలువలో దూకిన బాలుడు, తల్లిని వెలికితీసిన పోలీసులు. ప్రస్తుతం బాలుడు సృహలో ఉన్నాడు. తల్లి మాట్లాడే పరిస్థితిలో లేదు, కూతురు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.(3/3) Dgp Andhra Pradesh #GOODJOBAPCOPS #APPOLICE100 #AndhraPradeshPolice pic.twitter.com/UZSQt04BUZ
— East Godavari Police, Andhra Pradesh (@EGPOLICEAP) October 5, 2021
Also read:
Cannabis: హైదరాబాద్‌లో గంజాయి కోసం స్టూడెంట్స్ వెంపర్లాట.. ఒక్క రాత్రే 100 మంది అదుపులోకి
Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం.. ఎంతంటే..?