Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్‌ ప్రకటించిన కేంద్రం.. ఎంతంటే..?

Union Cabinet approves bonus: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని దీపావళి బోనస్‌గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటుకు రూ .4,445 కోట్లు.

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్‌ ప్రకటించిన కేంద్రం.. ఎంతంటే..?
Union Cabinet
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 06, 2021 | 3:52 PM

Union Cabinet approves bonus: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని దీపావళి బోనస్‌గా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం 2020-21 కొరకు RPF/RPSF సిబ్బందిని మినహాయించి, అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో సమానమైన బోనస్‌ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటుకు రూ .4,445 కోట్లు

న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందులో భాగంగా వస్త్ర పరిశ్రమకు మరింత ప్రొత్సాహన్ని అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటుకు రూ .4,445 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రధాన మంత్రి మిత్ర యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read Also… Uttarpradesh: యువతకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. ఆమోదం తెలిపిన యూపీ కేబినెట్..