AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarpradesh: యువతకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. ఆమోదం తెలిపిన యూపీ కేబినెట్..

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు...

Uttarpradesh: యువతకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. ఆమోదం తెలిపిన యూపీ కేబినెట్..
Yogi
Srinivas Chekkilla
|

Updated on: Oct 06, 2021 | 3:58 PM

Share

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా యువతకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఉచిత టాబ్లెట్ల, స్మార్ట్ ఫోన్ల పంపిణీ పథకానికి యూపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, స్కిల్ డెవలప్‌మెంట్, పారామెడికల్, నర్సింగ్ మొదలైన వివిధ టీచింగ్/ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో చేరిన యువతకు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల కోసం రాష్ట్రంలోని ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఆరోగ్య విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఐటీఐ, ‘సేవా మిత్ర’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపింది. టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీని యువత సాంకేతిక సాధికారత కోసమని యోగీ సర్కారు పేర్కొంది. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ .3,000 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వివిధ విద్యా సంస్థలు ఆన్‎లైన్ తరగతులు నిర్వహించాయి. ఈ సమయంలో పేదవారికి టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బంది పడ్డారు. అందుకే ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని యోగి సర్కారు తెలిపింది.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 312 సీట్లు గెలిచింది. బీఎస్పీ 19, ఎస్పీ 47, కాంగ్రెస్ ఏడు, అప్న దళ్ 9 సీట్లలో విజయం సాధించింది. అత్యధిక సీట్లు గెలుచుకున్న కాషాయదళం అక్కడ అధికారాన్ని చేజెక్కించుకుంది. అధిష్ఠానం నిర్ణయంతో యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Read Also.. Cabinet approves: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్‌ ప్రకటించిన కేంద్రం.. ఎంతంటే..?