Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan: ‘క్రూయిజ్‌లో ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదు’.. మహారాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్

ఆర్యన్‌ మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించారు ఎన్సీబీ అధికారులు. విచారణకు ఆయన ‌ పూర్తిగా సహకరిస్తున్నాడని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.

Aryan Khan: 'క్రూయిజ్‌లో ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదు'.. మహారాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్
Aryan Khan Drugs Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 06, 2021 | 5:16 PM

డ్రగ్స్‌ పార్టీ కేసులో షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ ఎన్సీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాడు. అయితే క్రూయిజ్‌లో ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌.  ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ ముద్దుల తనయుడు ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు వరుసగా రెండో రోజు విచారిస్తున్నారు. ఆర్యన్‌ మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించారు ఎన్సీబీ అధికారులు. విచారణకు ఆయన ‌ పూర్తిగా సహకరిస్తున్నాడని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సైన్న్స్‌ పుస్తకాలు కావాలని అడగడంతో వాటిని ఆర్యన్‌కు తెచ్చిచ్చారు ఎన్సీబీ అధికారులు. బుక్స్‌ చదువుతూనే అధికారుల ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. గురువారం వరకూ ఆర్యన్‌ ఏసీబీ కస్టడీలో ఉంటారు. అయితే ఎన్సీబీ అధికారులు కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్‌ వేసే అవకాశాలున్నాయి. ఆర్యన్ ఖాన్‌కు ఆహారంతో సహా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడం లేదు. ఆర్యన్‌తో పాటు ఈ కేసులో ఇతర నిందితులకు కూడా ఎన్‌సీబీ మెస్‌ నుంచి అధికారులు భోజన సదుపాయం కల్పించారు.

ఇంటి భోజనాన్ని లోపలకు అనుమతించడం లేదు. ఇప్పటికే వారందరి దగ్గర నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వాటిని పంపారు. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌లో అంతర్జాతీయ రాకెట‌్‌తో సంబంధాలున్నాయనడానికి తగిన సాక్ష్యాలను తాము సేకరించినట్టు ఇంతకుముందే సిటీ కోర్టుకు ఎన్‌సీబీ తెలిపింది. ఖాన్ ఫోన్ నుంచి జరిగిన సంభాషణల్లో చెల్లింపులు ఏ పద్దతిలో ఉండాలి? కోడ్ పేర్లు వంటికి చోటుచేసుకున్నట్టు పేర్కొంది. మరోవైపు ముంబైలో పలుచోట్ల ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు . అంధేరి , శాంతాక్రుజ్‌ తదితర ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. 17 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎన్సీబీ అధికారులు. అయితే క్రూయిజ్‌ పార్టీలో డ్రగ్స్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌. అసలు క్రూయిజ్‌లో ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదన్నారు. ముంబై పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.  గత ఏడాది నుంచి బాలీవుడ్‌ను పరువు తీయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అన్నీ చేస్తున్నదని ఆరోపించారు.

Also Read: ఆల్‌ టైమ్‌ రికార్డ్.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్ ధరలు.. దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి

‘ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డు.. క్యూఆర్‌ కోడ్‌తో అన్ని ఆరోగ్య వివరాలు’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు