ఆల్‌ టైమ్‌ రికార్డ్… భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్ ధరలు.. దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి

దేశంలో మరోసారి పెట్రో ధరలు భగ్గుమన్నాయి. డీజిల్‌, వంట గ్యాస్‌ కూడా అదేస్థాయిలో పెరిగాయి. వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది.

ఆల్‌ టైమ్‌ రికార్డ్... భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్ ధరలు.. దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి
Fuel Prices
Follow us

|

Updated on: Oct 06, 2021 | 5:53 PM

చమురు సెగలు కక్కుతోంది. పెట్రో మంట పుట్టిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌ టైమ్‌ రికార్డుస్థాయికి చేరాయి. బ్రేకుల్లేని బండిలాగా రన్‌ రాజా రన్‌ అంటూ పరుగెడుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల సెంచరీ మార్క్‌ క్రాస్‌ చేసింది. కొన్నిచోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర 114 రూపాయలకు చేరింది. దేశంలో మరోసారి పెట్రో ధరలు భగ్గుమన్నాయి. డీజిల్‌, వంట గ్యాస్‌ కూడా అదేస్థాయిలో పెరిగాయి. వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులపాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపుతో అదనపు భారం పడుతోంది. తాజాగా పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఈ పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కి 110 రూపాయలను దాటింది. ఒకట్రెండు చోట్ల లీటర్‌ పెట్రోల్‌కి 114 రూపాయలను దాటేసింది.

ఏపీ, తెలంగాణలో పెట్రోల్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.08 ఉండగా..డీజిల్​ ధర రూ.99.75గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.26 పైసలు పెరిగింది. డీజిల్ ధర 101.28 పైసలకు పెరిగింది. విశాఖలో లీటర్‌ పెట్రోల్ ధర 107.94 పైసలు ఉండగా…లీటర్ డీజిల్ ధర వందకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్​ధర 102.64 పైసలు, ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర 108.67 పైసలు, చెన్నైలో లీటర్‌ పెట్రోల్ ధర 100.23 పైసలు, బెంగళూరులో లీటర్‌ పెట్రోల్ ధర 105.95 పైసలకు పెరిగింది.

పెట్రోల్‌, డీజిలే కాదు…వంటగ్యాస్‌ ధర కూడా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. తాజాగా వంటగ్యాస్‌ సిలిండర్‌పై 15 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల‌ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.899.50కి, హైద‌రాబాద్‌లో రూ.952కి పెరిగింది. రెండు నెలల్లో వంటగ్యాస్ ధర నాలుగోసారి పెంచారు. ఈ ఏడాది మొత్తం క‌లిపి వంట గ్యాస్‌ సిలిండర్ ధ‌ర రూ. 205 వరకు పెరిగింది.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడిచమురు ధరలు కనిష్ఠానికి చేరిన పెట్రోల్‌ ధరలు తగ్గలేదు. పైగా నెలకోసారి పెరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ తర్వాత క్రమంగా ముడిచమురు ధర పెరుగుతూ తాజాగా 77.50 డాలర్ల ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర సర్కార్‌ మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. దాంతో ఇంధన ధరలు దేశంలో గరిష్ఠస్థాయికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Also Read: ‘ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డు.. క్యూఆర్‌ కోడ్‌తో అన్ని ఆరోగ్య వివరాలు’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!