CM Jagan: ‘ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డు.. క్యూఆర్‌ కోడ్‌తో అన్ని ఆరోగ్య వివరాలు’… సీఎం జగన్ కీలక ఆదేశాలు

వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు. స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై ఫోకస్ చేయండి. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలివి.

CM Jagan:  'ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డు.. క్యూఆర్‌ కోడ్‌తో అన్ని ఆరోగ్య వివరాలు'... సీఎం జగన్ కీలక ఆదేశాలు
Cm Jagan
Follow us

|

Updated on: Oct 06, 2021 | 6:22 PM

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మెడికల్‌ కాలేజీలు, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై కూడా చర్చించారు. హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను  సీఎం అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదని జగన్ అధికారులకు స్పష్టం చేశారు.  ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు

రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం రివ్యూ చేశారు.  కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే..వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జగన్ సూచించారు.  ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలి ఆదేశించారు.  పనులు ఆలస్యం కాకుండా శరవేగంగా ముందుకు సాగాలన్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌పైనా సీఎం సమీక్ష

కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు– నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్.  జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు సీఎం.  వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

‘ఆరోగ్య శ్రీ’ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు.  ఆరోగ్య మిత్రల ఫోన్‌ నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలన్నారు. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. 108 వెహికల్స్‌ సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలన్నారు.

ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సీఎం సమీక్ష

హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలని సూచించారు. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలన్న సీఎం ఆదేశించారు. డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

Also Read:హైదరాబాద్‌లో గంజాయి కోసం స్టూడెంట్స్ వెంపర్లాట.. ఒక్క రాత్రే 100 మంది అదుపులోకి

తల్లిని క్రూరంగా సుత్తితో 14 సార్లు కొట్టి చంపాడు.. ఆపై తప్పించుకునేందుకు షాకింగ్ ప్లాన్