Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు..
Earthquake in Pakistan: భారీ భూకంపంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోయింది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ సంభవించిన భారీ భూకంపంతో 20మంది మరణించారు. వందలాది
Earthquake in Pakistan: భారీ భూకంపంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోయింది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ సంభవించిన భారీ భూకంపంతో 20మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. కాగా.. ఈ భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి నసీర్ నాసర్ మీడియాకు వెల్లడించారు.
కాగా.. ప్రజలంతా నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. భారీగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు.
మారుమూల పర్వత ప్రాంతమైన హర్నాయ్‌కు రోడ్లు, విద్యుత్, మొబైల్ ఫోన్ కవరేజీ లేకపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం క్వెట్టా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్యకార్యకర్తలు టార్చ్ లైట్ల సాయంతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
Also Read: