Huge Robbery: ఖాకీ సినిమాను మించిన సీన్.. నిమిషాల్లో 69 లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. కాళ్లు విరిగినా వదిలిపెట్టని పోలీసులు..

Huge Robbery: దోపిడి దొంగలు రోజు రోజుకు తెలివిమీరుతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఊహించని రీతిలో దోపిడీలకు పాల్పడుతూ అధికారులకే ఝలక్‌ ఇస్తున్నారు.

Huge Robbery: ఖాకీ సినిమాను మించిన సీన్.. నిమిషాల్లో 69 లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. కాళ్లు విరిగినా వదిలిపెట్టని పోలీసులు..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 07, 2021 | 12:11 PM

Huge Robbery: దోపిడి దొంగలు రోజు రోజుకు తెలివిమీరుతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఊహించని రీతిలో దోపిడీలకు పాల్పడుతూ అధికారులకే ఝలక్‌ ఇస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో సినిమా ఫక్కీలో.. పోలీస్ అధికారులకు విస్మయం కలిగేలా 17 నిమిషాల్లో ఏటీఎంలోని రూ. 69 లక్షల నగదును కాజేసిన విషయం తెలిసిందే. ఈ దొంగల ముఠాలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఏటీఎం దొంగతనం ఎంత సినిమా ఫక్కీలో జరిగిందో.. దొంగలను పట్టుకోవడం అంతకు మించి సినిమాను తలదన్నేలా ఉంది. రాజస్థాన్ లో ఉన్న దొంగల ముఠాను పట్టుకునేందుకు కు పోలీసులు చేసిన సాహసోపేతం.. చివరకు కొందరు పోలీసులకు కాళ్లు విరిగేలా చేసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోలీసులు.. నిందితులను పట్టుకుని కర్నూలుకు తరలించారు.

కాస్త ఆటూ ఇటూగా ఖాకీ సినిమాను తలపించే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లాలోని డోన్‌ పట్టణంలో ఉన్న ఎస్‌బిఐ ఏటీఎంను నెల రోజుల క్రితం సినిమా ఫక్కీలో రాజస్థాన్ దొంగల ముఠా దోపిడీ చేసింది. పట్టణమంతా గాఢ నిద్రలో ఉండగా 2.58 నిమిషాలకు ఏటీఎం లోపలకి వెళ్లి గ్యాస్ కట్టర్ సహాయంతో 3:15 కు అరవై తొమ్మిది లక్షలు నగదు దోచుకుని వెళ్ళిపోయారు. అంటే కేవలం 17 నిమిషాల వ్యవధిలోనే రూ.69 లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దోపిడీకి పాల్పడింది రాజస్థాన్ ముఠాగా గుర్తించారు. దోపిడీదారులు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి మకాం మార్చారు. దాదాపు 15 రోజుల పాటు మకాం వేసిన పోలీసులు.. సినిమా స్టైల్‌లో దొంగల ముఠాను వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో దోపిడీ ముఠా చేసిన దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. కాళ్లు కూడా విరిగాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోలీసులు.. దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ నుంచి ప్యాపిలి పోలీస్ స్టేషన్‌కు నిందితులను తరలించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై సభ్యుల ప్రశ్నలు.. అసెంబ్లీలో సమాధానమిచ్చిన మంత్రి గంగుల

Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..