- Telugu News Spiritual My Home Group Chairman Jupally Rameshwar Rao visited the SV Goshala in Tirumala after being sworn in as a board member of the TTD
TTD Member Jupally: తిరుమల శ్రీవారి నవనీత సేవ, దర్శనంలో తరించిన టీటీడీ బోర్డ్ మెంబర్ జూపల్లి రామేశ్వర్ రావు
Tirumala - Jupally Rameswar Rao: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమల శ్రీవారి నవనీత సేవ, తదుపరి తిరుమలేశుని దర్శనంలో పాల్గొని తరించిన మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు
Updated on: Oct 07, 2021 | 10:49 AM

దేవదేవుడు తిరుమల శ్రీవారి నవనీత సేవలో టీటీడీ బోర్డు మెంబర్.. మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు

దేవదేవుడు తిరుమల శ్రీవారి నవనీత సేవలో టీటీడీ బోర్డు మెంబర్.. మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పాల్గొన్నారు.

గోశాలలో కవ్వంతో వెన్న చిలికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సేవలో జూపల్లి తరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం రామేశ్వర్ రావు తిరుమలలోని ఎస్వీ గోశాలను సందర్శించారు.

ఇవాళ టీటీడీ బోర్డ్ మీటింగ్ జరగనుంది. కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత తొలి సమావేశం ఇది.

ఇవాల్టి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో క్రతువుల నిర్వహణ, ఏర్పాట్లపై ఈ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు.

ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

అనంతరం తిరుమలేశుని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు అందుకుని తరించారు జూపల్లి రామేశ్వర్ రావు

మొదటిరోజు రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.





























