AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crow in a Dream: మీ కలలో కాకి ఈ విధంగా కనిపించిందా?.. అయితే మీకు పండగే పండుగ.. ఎందుకంటే..!

Crow in a Dream: రాత్రి నిద్రిస్తున్న సమయంలో చాలా మందికి వివిధ రకాల కలలు వస్తుంటాయి. కొందరికి దెయ్యం కలలు, మరికొందరికి దేవుళ్ల కలలు వంటి కలలు వస్తుంటాయి.

Crow in a Dream: మీ కలలో కాకి ఈ విధంగా కనిపించిందా?.. అయితే మీకు పండగే పండుగ.. ఎందుకంటే..!
Kaki
Shiva Prajapati
|

Updated on: Oct 07, 2021 | 9:09 AM

Share

Crow in a Dream: రాత్రి నిద్రిస్తున్న సమయంలో చాలా మందికి వివిధ రకాల కలలు వస్తుంటాయి. కొందరికి దెయ్యం కలలు, మరికొందరికి దేవుళ్ల కలలు వంటి కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనల్ని భయబ్రాంతులకు గురి చేసే పీడ కలలు కూడా వస్తుంటాయి. అయితే, రాత్రి పడుకున్న సమయంలో వచ్చే కలలు, తెల్లవారుజామున వచ్చే కలలకు వ్యత్యాసం ఉంటుందని పెద్దలు అంటుంటారు. తెల్లవారుజామున వచ్చే కలలు దాదాపుగా నిజమవుతాయని విశ్వాసం. మరొక వాదన ఏంటంటే.. కొన్ని రకాల వస్తువులు, జంతువులు కలలో కనిపించడం.. భవిష్యత్‌కు సంకేతాలుగా పేర్కొంటారు. వాటి ప్రభావం జీవితంపై ఉంటుందని అభిప్రాయం ఉంది. ఆ విశ్వాసాలే.. కలలకు సంబంధించి మంచీ, చెడు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి కలలో తూర్పు నుండి పడమరకు కాకి ఎగురుతున్నట్లుగా కనిపిస్తే, అతను త్వరలో సంపదను పొందుతాడని విశ్వాసం. 2. ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష, పోటీకి సిద్ధమవుతున్నప్పుడు వారి కలలో కాకి పెరుగు, వెన్న తింటున్నట్లుగా కనిపిస్తే అది శుభ సూచకంగా భావించాలి. ఈ రకమైన కల వస్తే సదరు వ్యక్తులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 3. కలలో వలలో చిక్కుకున్న కాకి ఏదో విధంగా ఆ ఉచ్చు నుండి విముక్తి పొంది ఎగిరిపోయినట్లు కనిపిస్తే.. ఆ వ్యక్తి త్వరలోనే తన శత్రువులపై విజయం సాధిస్తాడని అర్థం. 4. ఎగురుతున్న కాకుల గుంపులోంచి ఓ కాకి అతని వద్దకు వచ్చి తాను పెట్టిన పండును తిన్నట్లుగా కల వస్తే వారి పంట పండినట్లే. సదరు వ్యక్తులకు కుమారు జన్మించడం గానీ, సంపద లభించడం గానీ జరుగుతుంది. 5. వ్యాపార స్థలంలో కాకి కూర్చున్నట్లుగా రాత్రి సమయంలో వ్యక్తికి కల వస్తే.. ఆ వ్యక్తి వ్యాపారంలో అనూహ్యమైన విజయం సాధిస్తాడు. 6. పెళ్లికాని యువకుడు, పెళ్లికాని అమ్మాయి కలలో కాకి తన ఇంటి వెనుక కూర్చొని ఉన్నట్లుగా కినిపించినట్లయితే.. వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. 7. ఒక వివాహిత వ్యక్తి, స్త్రీ కలలో పాలు తాగుతున్న కాకి కనిపించినట్లయితే.. వారికి త్వరలోనే కుమారుడు జన్మిస్తాడు. పెళ్లికాని వ్యక్తికి అలా కనిపిస్తే త్వరలోనే అతని వివాహం నిశ్చయమవుతుంది. 8. ఒక నిరుద్యోగి కలలో కాకి పెరుగు తినడం కనిపిస్తే.. త్వరలోనే అతనికి ఉపాధి లభిస్తుంది. 9. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కలలో కాకి పెరుగు తింటున్నట్లుగా కనిపిస్తే అతను త్వరలోనే వ్యాధి నుండి విముక్తి పొందుతాడు.

Also read:

Shirdi Sai Baba: షిర్డీ సాయి భక్తులకు గుడ్‌న్యూస్.. సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న బాబా మందిరం..

అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..

Jr.NTR: నేనున్నా.. అధైర్యపడొద్దు.. అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్..