Jr.NTR: నేనున్నా.. అధైర్యపడొద్దు.. అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Oct 07, 2021 | 9:47 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గోంటూ

Jr.NTR: నేనున్నా.. అధైర్యపడొద్దు..  అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్..
Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గోంటూ తన వంతు సహాయాన్ని అందిస్తుంటాడు. నటనలోనూ.. దాతృత్వంలోనూ.. సీనియర్ ఎన్టీఆర్‏ను తలపిస్తుంటాడు యంగ్ టైగర్. అందుకే జూనియర్ ఎన్టీఆర్‏కు అభిమానులు ఎక్కువే. తమ అభిమాన హీరోను కలవాలని.. ఒక్కసారైనా మాట్లాడాలని ఆశించేవారు ఎక్కువగానే ఉంటారు. అలాగే ఎన్టీఆర్ సైతం తన అభిమానుల కోరికలను తీర్చడంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీరుస్తూ.. వారిని వారికి సర్ ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి తన అభిమానికి కోరిక తీర్చాడు యంగ్ టైగర్.

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం.. గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం కొప్పాడి మురళి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో తనకు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని ఉందని.. డాక్టర్‏కు పేపర్ రాసి ఇచ్చాడు. ఇది చూసిన డాక్టర్.. ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న . జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు ఎన్టీఆర్‏కు తెలియజేశారు. దీంతో తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు ఎన్టీఆర్. అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మెరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత.. కొరటాల శివ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు.

Also Read: Pushpa Movies: పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్.. అనుకొని షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఎంత డిమాండ్ చేసిందంటే ?

Bigg Boss 5 Telugu: శ్రుతిమించిన విశ్వ యవ్వారం.. అసభ్య పదాలతో కంటెస్టెంట్స్ పై దూకుడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu