Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..

చల్ల చల్లటి జ్యూస్ తాగుతున్నప్పుడు ఆ గ్లాస్‌పై నీటి బిందువులు మీ చేతికి తగులుతుంటాయి. గ్లాస్‌లోని నీరు బయటకు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.. అదే ఓ అద్భుతమైన..

Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..
Air Water Conversion
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 07, 2021 | 11:46 AM

చల్ల చల్లటి జ్యూస్ తాగుతున్నప్పుడు ఆ గ్లాస్‌పై నీటి బిందువులు మీ చేతికి తగులుతుంటాయి. గ్లాస్‌లోని నీరు బయటకు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.. అదే ఓ అద్భుతమైన ఆలోచనకు అడుగులు పడేలా చేసింది. ఈ నీటి బిందువులు ఎక్కడి నుండి వస్తాయి? అని అంటే అవి బాహ్య వాతావరణం నుండి వస్తుంటాయి. మన చుట్టూ ఉండే గాలిలోని తేమ ద్వారా అలా వస్తుంటాయి. ఈ సూత్రంపై అమెరికా, స్పెయిన్, ఇజ్రాయెల్ వంటి దేశాలలోని శాస్త్రవేత్తలు గాలి నుండి నీటిని తయారు చేయడానికి యంత్రాలను రూపొందించారు. ఈ యంత్రాలు AC అంటే ఎయిర్ కండీషనర్ వంటి వైర్లను ఉపయోగించి గాలిని చల్లబరుస్తాయి.. ఆ తరువాత ఒక పాత్రలో నీటి బిందువులను సేకరిస్తారు. ఇది మేజిక్ కాదు, గాలిలో ఉన్న తేమను నీటిగా మార్చే శాస్త్రం.

ఫిల్టరబుల్ తాగునీరు!

వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సునామీ ప్రొడక్ట్స్‌లో డిజైన్ ఇంజనీర్ టెడ్ బౌమన్ డ్యూయిష్ వెల్లేతో మాట్లాడుతూ.. “మేము ఈ యంత్రాల సహాయంతో గాలిలోని తేమ నుండి నీటిని తయారు చేస్తున్నాము. గాలిలో ఉన్న తేమ నుండి నీటిని తీయడానికి ఇటీవల అభివృద్ధి చేయబడిన అనేక వ్యవస్థలలో ఇది ఒకటి. ” అతను తన కంపెనీ యంత్రాలు, గాలిలోని తేమను వేరు చేస్తాయని తెలిపారు. దీని నుంచి బయటకు వచ్చే నీటిని ఫిల్టర్ చేసి మనం తాగేలా చేస్తామన్నారు.

రోజుకు 8,600 లీటర్ల నీరు

ఈ పద్దతిలో నీటి తయారు చేసే యంత్రాలను అభివృద్ధి చేస్తున్నారు. గాలి నుండి నీటిని తయారు చేసే యంత్రాలను గృహ, కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ యంత్రాలు పొగమంచు ఉన్న ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి. వాటి పరిమాణాన్ని బట్టి ఈ యంత్రాలు ఒక రోజులో 900 నుండి 8,600 లీటర్ల నీటిని తయారు చేయగలవు.

వీటి ప్రస్తుతం ధర భారత కరెన్సీల్లో రూ. 30,000 నుండి 2,00,000 (రూ. 22,43,796 నుండి రూ .1,49,58,640) పరిధిలో అందుబాటులో ఉన్నాయి. అయితే, కాలిఫోర్నియాలోని చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో తమ నీటి సమస్యలను  తీర్చుకోడానికి ఈ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు.

సౌర ఫలకాలతో యంత్రాలతో..

కాలిఫోర్నియాలో నివాసం ఉండే డాన్ జాన్సన్ ఈ పరికరాన్ని తన తోట కోసం వినియోగిస్తున్నాడు. ఇలా తయారైన నీటిని తన తోటలోని పంట సాగు కోసం వినియోగిస్తున్నాడు. అయితే ఈ మిషన్‌కు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో.. సౌర శక్తిని వినియోగిస్తున్నాడు. దీంతో అతనికి చాలా కలిసి వచ్చింది. ఇది కాలిఫోర్నియా నీటి సంక్షోభానికి పెద్ద పరిష్కారం కానుంది. భవిష్యత్తులో కరువు ప్రమాదం గురించి జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి: అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..