Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Screen Glass: గుడ్‌న్యూస్‌..ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు..! ఈ వీడియో చుస్తే మీరు కూడా నమ్ముతారు..

Smartphone Screen Glass: గుడ్‌న్యూస్‌..ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు..! ఈ వీడియో చుస్తే మీరు కూడా నమ్ముతారు..

Anil kumar poka

|

Updated on: Oct 07, 2021 | 10:27 PM

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎంత ఖరీదైన ఫోన్‌ అయిన కింద పడిందంటే చాలు స్క్రీన్‌ గ్లాస్‌ పగలడం ఖాయం. ఎంత కాస్ట్లీ ఫోన్‌ అయినా స్క్రీన్‌ పగిలిపోయిందంటే దాని లుక్కే పోతుంది. అయితే

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎంత ఖరీదైన ఫోన్‌ అయిన కింద పడిందంటే చాలు స్క్రీన్‌ గ్లాస్‌ పగలడం ఖాయం. ఎంత కాస్ట్లీ ఫోన్‌ అయినా స్క్రీన్‌ పగిలిపోయిందంటే దాని లుక్కే పోతుంది. అయితే ఇకపై ఈ ప్రోబ్లమ్‌ ఉండదు. అత్యంత గట్టిగా ఉండి ఒత్తిడి తట్టుకునే సరికొత్త గాజు త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. కెనడాకు చెందిన మెక్‌గిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. సాధారణ గాజును, ఆక్రిలిక్‌ను కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారు. సాధారణ గాజుతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుందని చెబుతున్నారు.

ఆల్చిప్పల్లో ముత్యాలు రూపొందే పద్ధతి ఆధారం గానే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ గ్లాస్‌ను తయారు చేశారు. ఆల్చిప్పల లోపలి వైపు నెక్ర్‌గా పిలిచే పదార్థం ఉంటుంది. పెళుసుగా ఉండే కాల్షియం కార్బోనేట్‌ పదార్థం, సాగే గుణమున్న ఆర్గానిక్‌ పదార్థం కలిసి ‘నెక్ర్‌’గా రూపొందుతాయి. దీనితో రూపొందే ఆల్చిప్పలు, ముత్యాలు దృఢంగా ఉంటూనే.. ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పెళుసుగా ఉండే గాజును, సాగే గుణమున్న ఆక్రిలిక్‌ను కలిపి దృఢమైన గ్లాస్‌ను రూపొందించారు. దీని తయారీ చాలా సులువని, ధర కూడా తక్కువే ఉంటుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లతోపాటు టీవీలు, మానిటర్లు వంటివాటికి ఈ గాజును వినియోగించవచ్చని చెబుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్‌ అవుతారు..!(వీడియో వైరల్)

 Bitcoin With Volcanic Energy: అగ్ని పర్వతాలనుంచి బిట్‌ కాయిన్స్‌..! చిన్న దేశమైనా గొప్ప నైపుణ్యం.. వైరల్ అవుతున్న వీడియో

 Earth: మసకబారిపోతున్న భూమి..! కాలుష్యం కారణంగా భూమిపై మొదలైన పరిణామం..(వీడియో)

 PM Modi: ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశా.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ..!(వీడియో)

Published on: Oct 07, 2021 09:26 PM