Bitcoin With Volcanic Energy: అగ్ని పర్వతాలనుంచి బిట్‌ కాయిన్స్‌..! చిన్న దేశమైనా గొప్ప నైపుణ్యం.. వైరల్ అవుతున్న వీడియో

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్‌ సాల్వడర్‌ మరో కీలక అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్‌ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది.

Bitcoin With Volcanic Energy: అగ్ని పర్వతాలనుంచి బిట్‌ కాయిన్స్‌..! చిన్న దేశమైనా గొప్ప నైపుణ్యం.. వైరల్ అవుతున్న వీడియో

|

Updated on: Oct 06, 2021 | 9:14 PM

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్‌ సాల్వడర్‌ మరో కీలక అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్‌ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే బిట్‌కాయిన్‌ను ఉత్పత్తి చేసింది కూడా. ఈ మేరకు ఎల్‌ సాల్వడర్‌ అధ్యక్షుడు నయిబ్‌ బుకెలె అధికారికంగా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. క్రిప్టోకరెన్సీకి మార్కెటింగ్‌లో మంచి పోటీనడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న ఎల్‌ సాల్వడర్‌.. అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్‌ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. దాంతో పునరుత్పాదక శక్తి ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది. అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

జియోథర్మల్‌ ఎనర్జీ అనేది చాలా స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్‌ ఎనర్జీని డిజిటల్‌ ఎనర్జీ అంటే బిట్‌కాయిన్‌గా మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్‌ చేయొచ్చు. ఈ మేరకు జియోథర్మల్‌లో బిట్‌కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్‌ బుకెలె ట్విటర్‌ ద్వారా చూపించారు.
సాధారణంగా క్రిప్టోకరెన్సీ ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్‌నూ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌ సాల్వడర్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్‌ సేవ్‌ కావడమే కాదు.. జియోథర్మల్‌ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్‌ సాల్వడర్‌ చేసిన ఈ ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే పొగడ్తలు గుప్పించారు. కేంబ్రిడ్జి బిట్‌కాయిన్‌ ఎలక్ట్రిసిటీ కన్‌జంప్షన్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ల ఉత్పత్తి కోసం 105 టెరావాట్‌ గంటల పవర్‌ను ఒక ఏడాదికి ఉపయోగిస్తున్నారు. ఫిలిప్పైన్స్‌ దేశం ఒక ఏడాదిలో మొత్తం ఉపయోగించే కరెంట్‌ కంటే ఇది ఎక్కువని ఒక అంచనా. కాగా బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీకి ఎల్‌ సాల్వడర్‌ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్‌కాయిన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్‌ సర్కార్‌ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్‌కాయిన్లను అందించింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Earth: మసకబారిపోతున్న భూమి..! కాలుష్యం కారణంగా భూమిపై మొదలైన పరిణామం..(వీడియో)

 PM Modi: ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశా.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ..!(వీడియో)

 Nagarkurnool : ఏనాడు విధులకు రాని డాక్టర్‌.. 4ఏళ్లుగా జీతభత్యాలు.. అసలు కథా ఏంటంటే..?(వీడియో)

 Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత డబుల్ గేమ్? జీవిత ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్.. రాజశేఖర్‌ మాత్రం మంచు ఫ్యామిలీకి టచ్‌లో..(లైవ్ వీడియో)

Follow us