smart watch saves a person: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రాణం పోసిన స్మార్ట్ వాచ్..!(వీడియో)
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని స్మార్ట్ వాచ్ కాపాడింది. రాత్రి వేళ చుట్టూ ఎవరు లేకపోవడంతో ఒంటరిగా రోడ్డుపైనే ఉండిపోయిన వ్యక్తికి వాచ్ ప్రాణం పోసింది. సెప్టెంబర్ 25న సింగపూర్‌లో బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ ఫిత్రిని ఒక వ్యాన్ ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని స్మార్ట్ వాచ్ కాపాడింది. రాత్రి వేళ చుట్టూ ఎవరు లేకపోవడంతో ఒంటరిగా రోడ్డుపైనే ఉండిపోయిన వ్యక్తికి వాచ్ ప్రాణం పోసింది. సెప్టెంబర్ 25న సింగపూర్‌లో బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ ఫిత్రిని ఒక వ్యాన్ ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన అతను తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత అతను స్పృహ కోల్పోయారు. రాత్రి వేళ కావడంతో అతన్ని కాపాడేందుకు ఎవరూ సమీపంలో లేరు. అయితే ఫిత్రి చేతికి ఉన్న ఆపిల్ వాచ్ ఆటోమేటిక్‌గా స్పందించింది. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేసింది. అతడు పడి ఉన్న లోకేషన్‌ను కూడా షేర్ చేసింది.
దీంతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది స్పందించారు. రాత్రి 8.20కి ప్రమాదం గురించి తమకు అలెర్ట్ వచ్చిందని, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత అధికారి తెలిపారు.కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో ఫిత్రికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదృష్టవశాత్తు అతను ధరించిన స్మార్ట్ వాచ్‌లో చార్జ్ ఉండటంతో దాని అలెర్ట్ వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆపిల్ స్మార్ట్ వాచ్ నుంచి తనకు కూడా అలెర్ట్ వచ్చినట్లు ఆ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ వెల్లడించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Amazon offer On One Plus: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 3 వేల తగ్గింపులో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు..!(వీడియో)
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి కోలాట నృత్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

