అవిభక్త కవలలను విడదీసిన జోర్డన్‌ వైద్యులు.. విజయవంతంగా అరుదైన ఆపరేషన్‌.. వీడియో

Phani CH

Phani CH |

Updated on: Oct 08, 2021 | 9:36 AM

జోర్డన్‌ దేశం వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. అవిభక్త కవలలపై వీరు జరిపిన సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఏడు నెలల వయసున్న కవలలు..

జోర్డన్‌ దేశం వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. అవిభక్త కవలలపై వీరు జరిపిన సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఏడు నెలల వయసున్న కవలలు అహ్మద్‌, మహమ్మద్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని సాధారణ చిన్నారుల్లా వారి ప్రవర్తన ఉన్నట్లు అమ్మాన్‌ హాస్పిటల్‌ ఛీఫ్‌ సర్జన్‌ ఫాజి హమ్మౌరి తెలిపారు. కవలల్ని సర్జరీ ద్వారా విడదీసే ప్రక్రియను దేశంలోనే మొదటిసారి వైద్య బృందం నిర్వహించారు. జులై మాసంలో సర్జరీ నిర్వహించినా శిశువుల ఆరోగ్యం మెరుగయ్యేవరకు వేచి చూడాలన్న ఆలోచనతో ఉన్న ప్రభుత్వం వైద్యులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిది గంటల సమయం జరిపిన సర్జరీలో 25 మంది సర్జన్లు పాల్గొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హైవేపై స్పీడుకు..హైకోర్టు బ్రేకులు.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు.. వీడియో

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ని తొక్కడం ఎవరివల్లా కాదు.. లైవ్ వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu