- Telugu News World NASA DART mission shooting rocket at asteroid in test of planetary defense America Armageddon
Nasa mission: సైక్ ఆస్టరాయిడ్‌లో అత్యంత అరుదైన, విలువైన లోహాలు. నిగ్గుతేల్చే ప్రయోగానికి నాసా రెడీ
Nasa asteroid mission:సైక్ ఆస్టరాయిడ్‌లో లోహాలు ఉన్నాయా ? ఇనుమును అధికంగా కలిగి ఉందా ? ఈ విషయాన్ని పరిశోధించడానికి నాసా ఓ ప్రయోగం చేస్తోంది.
Updated on: Oct 07, 2021 | 8:37 AM

సైక్ ఆస్టరాయిడ్‌లో లోహాలు ఉన్నాయా ? ఇనుమును అధికంగా కలిగి ఉందా ? ఈ విషయాన్ని పరిశోధించడానికి నాసా ఓ ప్రయోగం చేస్తోంది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది.

సైక్ ఆస్టరాయిడ్‌లో ధూళి, మంచు కాకుండా అత్యంత అరుదైన, విలువైన లోహాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే సైక్ గ్రహ శకలాన్ని అధ్యయనం చేసేందుకు సైక్ మిషన్‌ను వచ్చే ఏడాది ప్రయోగించబోతున్నారు.

జూలెస్ వెర్నే రాసిన నవల ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ స్ఫూర్తితో అమెరికాకు చెందిన నాసా ఈ ప్రయోగం చేస్తోంది. ప్రాచీన ప్రపంచానికి చెందిన ద్రవ రూపంలో గడ్డకట్టిన భారీ గ్రహ శకలాన్ని ఈ మిషన్ అధ్యయనం చేస్తుంది.

అంగారక, గురు గ్రహాల మధ్య ప్రధాన ఆస్టరాయిడ్ బెల్ట్‌లో సూర్యుని చుట్టూ తిరిగే సైక్ ఆస్టరాయిడ్ లక్ష్యంగా ఈ సైక్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ప్రాచీన భూ గ్రహ నిర్మాణంలో ఇనుము అధికంగా ఉన్న ప్రదేశంగా సైక్ ఆస్టరాయిడ్‌ను శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సౌర వ్యవస్థ ఏర్పడే సమయంలో వెలుపలి శిలా భాగం విడిపోయి సైక్ ఆస్టరాయిడ్‌గా ఏర్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.

భూమిపై ఏర్పాటు చేసిన రాడార్లు, టెలిస్కోపుల ద్వారా పరిశీలించినపుడు ఈ సైక్ ఆస్టరాయిడ్ వెడల్పు 280 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిలో అధికంగా లోహాలు ఉన్నట్లు గమనించారు.

వచ్చే ఏడాది సైక్ స్పేస్‌క్రాఫ్ట్ ను ప్రయోగించబోతున్నారు.

దీని ద్వారా ఈ సైక్ ఆస్టరాయిడ్‌లో ఐరన్ ఆక్సైడ్స్ ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయనే విషయంపై అధ్యయనం చేస్తారు.





























