New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై సభ్యుల ప్రశ్నలు.. అసెంబ్లీలో సమాధానమిచ్చిన మంత్రి గంగుల

రేషన్ కార్డుల జారీకి కేంద్రం పరిమితులు విధించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నార్థులు ఉండకూడదని తెలంగాణలోని ప్రతీ అర్హునికి అందజేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై సభ్యుల ప్రశ్నలు.. అసెంబ్లీలో సమాధానమిచ్చిన మంత్రి గంగుల
Telangana Ration Cards
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2021 | 9:36 PM

Telangana Ration Cards: రేషన్ కార్డుల జారీకి కేంద్రం పరిమితులు విధించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నార్థులు ఉండకూడదని తెలంగాణలోని ప్రతీ అర్హునికి అందజేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తద్వారా అన్నార్థులు లేని తెలంగాణ రాష్ట్ర సాకారం చేసే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో రేషన్ కార్డులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల సమాధానమిచ్చారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకూ కొత్త రేషన్ కార్డుల కోసం 9,53,394 అప్లికేషన్లు వచ్చాయని వీటిలో 6,70,999 అర్హమైనవిగా తేల్చి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని వెల్లడించారు. వీటి ద్వారా 21,30,194 మంది లబ్దీపొందుతున్నారని తెలిపారు.

అనంతరం సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలు కార్డులు ఎందుకు రిజెక్ట్ చేస్తారు? రేషన్ డీలర్లను పెంచాలి.. అప్లికేషన్లు తీసుకొని కొత్త కార్డులు ఇవ్వాలని అడిగిన వాటికి సైతం మంత్రి గంగుల సమాధానాలు తెలియజేశారు. 2016 లో 94,417 కార్డులు, 3,30,459 లబ్దీదారులు, 2017లో 36,039 కార్డులు, 1,26,136 లబ్దీదారులు, 2018లో 1,65,036 కార్డులు, 5,77,626 లబ్దీదారులు, 2019లో 64,471 కార్డులు, 2,25,649 లబ్దీదారులు, 2020 లో 11 కార్డులు, 39 లబ్దీదారులు, 2021లో 3,11,025 కార్డులు, 8,70,285 లబ్దీదారులు ఉన్నారన్నారు. ఆహార భద్రతా కార్డులపై సమగ్ర సమాచారం సభకు అందించారు. ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో నూతనంగా 8,70,285 లబ్దీదారులకు 3,11,025 కార్డులను అందించిందన్నారు. ప్రభుత్వం వద్ద అప్పటివరకూ ఉన్న 4,99,525 అప్లికేషన్లలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వెరిఫికేషన్ తర్వాత 4,80,782, 360 డిగ్రీ సాప్ట్వేర్ వెరిఫికేషన్ తర్వాత అర్హమైన 4,18,037 అప్లికేషన్లలో 74 శాతం 3,11,025 నూతన కార్డులకు అర్హత సాధించాయని, 26 శాతం 1,07,012 అనర్హత పొందాయన్నారు.

అగ్రికల్చర్ లాండ్ ఎక్కువగా ఉండడం, ఇదివరకే కార్డులో పేరు నమోదై ఉండడం, కార్లు కలిగి ఉండడం, టాక్స్ పేయర్లు, ప్రొపెషనల్స్, రిటైర్డ్ పెన్షనర్స్, వివిద శాఖల ప్రభుత్వ ఉద్యోగులు వంటి ఇతరత్రా కారణాలతో అనర్హలుగా తేలారని చెప్పారు. అర్హతల క్రైటీరియా ప్రకారం గ్రామాల్లో లక్షన్నర సంవత్సరాదాయం, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వార్షికాదాయం, మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల మెట్ట భూమి వరకూ ఉన్నకుటుంబాలు అర్హులన్నారు.

కేంద్ర పథకంలోని కార్డులను 2013 ఎన్ఎఫ్ఎస్ఏ ఆక్ట్ ప్రకారం తెలంగాణలో 191.696 లక్షల లబ్దీదారులకు మించి పెంచడానికి లేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక నిరుపేద కూడా ఆకలితో ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కార్డులను మంజూరు చేసిందన్నారు. 36.92 లక్షల కార్డులతో  95.98 లక్షల మంది లబ్దీదారులు రాష్ట్రం పరిదిలో ఉన్నారని తెలిపారు.  మొత్తంగా తెలంగాణలో 90.49 లక్షల కార్డులు, 2 కోట్ల 87లక్షల 68వేల లబ్దీదారులు ఉన్నారని తెలిపారు. జూన్ 8 2021న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుండి పదవ తారీకు వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు మంత్రి తెలిపారు.  ఆ రెండు రోజుల్లో సైతం 800లకు పైగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. కొత్త కార్డుల అప్లికేషన్ నిరంతర ప్రక్రియ అని చెప్పారు.

Also Read..

Prabhas: ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. టైటిల్ పేరెంటో తెలుసా..

Asaduddin Owaisi Warning: పాతబస్తీ నేరస్థులకు అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ వార్నింగ్.. ఇంతకీ ఏమన్నారంటే..!