హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. పాతబస్తీలో రోజు రోజుకీ పెరుగుతున్న హత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాతబస్తీ మత పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ప్రతి చిన్న విషయానికి ఇరువర్గాలు కొట్టుకుంటూ హత్యలు చేసుకుంటున్నారని, ఈ మధ్య కాలంలో హత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు కోసం తల్లిదండ్రులు, మతపెద్దలు ముందుకు రావాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పాతబస్తీలో యువకులు గ్యాంగ్‌లు మెయింటెన్ చేసి అమాయకులని వేధించి, హత్యకు పాల్పడితే అలాంటి వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో వదలను అంటూ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
ప్రజలని వేధించే వ్యక్తులను గుర్తించి వాళ్ళ మార్పు కోసం ప్రయత్నించాలని, లేకుంటే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఆయన సూచించారు. అయినా వారిలో మార్పు రాకపోతే.. సామాజిక బహిష్కరణ చేయాలని మత పెద్దలకు అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ప్రజల్ని వేధించే ఎంతటి వాడైనా సరే తాను వదిలిపెట్టను అంటూ ఓవైసీ చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వ్యక్తుల ఓట్లు కూడా తమ పార్టీకి అవసరం లేదని, ప్రజలు వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.
నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్ ,హైదరాబాద్.
Also read:
Crime News: భార్యను కడతేర్చేందుకు భర్త మాస్టర్ ప్లాన్.. మానవ బాంబుగా మారి కౌగిలించుకుని..
Samantha: ఆ తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ఇలా.. విడాకుల తర్వాత పెళ్లిరోజున సింగిల్ ఫోటో షేర్ చేసిన సమంత..