Samantha: ఆ తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ఇలా.. విడాకుల తర్వాత పెళ్లిరోజున సింగిల్ ఫోటో షేర్ చేసిన సమంత..

సమంత.. నాగచైతన్య టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్.. ఈ జంటకు అభిమానులు ఎక్కువే.. ఏడేళ్లు ప్రేమ అనంతరం.. పెద్దలను ఒప్పించి

Samantha: ఆ తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ఇలా.. విడాకుల తర్వాత పెళ్లిరోజున సింగిల్ ఫోటో షేర్ చేసిన సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2021 | 10:30 AM

సమంత.. నాగచైతన్య టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్.. ఈ జంటకు అభిమానులు ఎక్కువే.. ఏడేళ్లు ప్రేమ అనంతరం.. పెద్దలను ఒప్పించి మరి ఘనంగా వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా గడిపిన జంటగా.. ఆకస్మాత్తుగా విడాకుల ప్రకటన ఇచ్చి షాకిచ్చింది. ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉండే సామ్ చైతన్యలు విడాకులు తీసుకోవడంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. 2017 అక్టోబర్ 7న వీరిద్దరి వివాహం జరిగింది. ఇక ఈనెల అక్టోబర్ 2న వీరిద్దరూ తాము విడాకులు తీసుకున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. విడాకుల ప్రకటన అనంతరం చైతూ సైలెంట్ అయ్యాడు. కానీ సమంత మాత్రం.. సోషల్ మీడియా వేదికగా.. తన ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తేలా ఎమోషనల్ కోట్స్ చేస్తూ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈరోజు (అక్టోబర్ 7న) సమంత.. నాగచైతన్యల పెళ్లిరోజు.. ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన ఇన్‏స్టాలో భావోద్వేగ పోస్ట్ చేస్తూ తన సింగిల్ ఫోటో షేర్ చేసింది. పాత ప్రేమ పాటలు – పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. అందులో సామ్.. తెల్లని డ్రెస్ ధరించి.. నేలవైపు చూస్తూ ఒంటరిగా నడుస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read:  Tamannah: మిల్కిబ్యూటీకి షాకిచ్చిన మేకర్స్.. రంగంలోకి దిగిన రంగమ్మత్త.. పోటీకోసం తంటాలు..

Pushpa Movies: పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్.. అనుకొని షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఎంత డిమాండ్ చేసిందంటే ?