AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannah: మిల్కిబ్యూటీకి షాకిచ్చిన మేకర్స్.. రంగంలోకి దిగిన రంగమ్మత్త.. పోటీకోసం తంటాలు..

మిల్కిబ్యూటీ తమన్నా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడు హవా సాగుతుంది. అటు వెండితెరపై ఇటు.. డిజిటల్ ఫ్లాట్ ఫాంపై సత్తా

Tamannah: మిల్కిబ్యూటీకి షాకిచ్చిన మేకర్స్.. రంగంలోకి దిగిన రంగమ్మత్త.. పోటీకోసం తంటాలు..
Tamannah
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2021 | 9:46 AM

Share

మిల్కిబ్యూటీ తమన్నా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడు హవా సాగుతుంది. అటు వెండితెరపై ఇటు.. డిజిటల్ ఫ్లాట్ ఫాంపై సత్తా చూపిస్తూ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. కేవలం హీరోయిన్‏గానే కాకుండా… ఇటీవల విలన్ పాత్రలో నటించి అదుర్స్ అనిపించుకుంది మిల్కిబ్యూటీ. దశాబ్దంన్నరకు పైగా సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా అగ్రస్థానంలో కొనసాగుతున్న తమన్నా.. ఇటీవలే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈషోకు హోస్ట్‏గా వ్యవహరిస్తుంది తమన్నా. అయితే వెండి తెరపై తమన్నాకు ఉన్న క్రేజ్ బట్టి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు భారీగానే డిమాండ్ చేసిందట. ఇందుకు మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మాస్టర్ చెఫ్.. ఘనంగా ప్రారంభించారు మేకర్స్. అయితే మాస్టర్ చెఫ్ షోకు ఆశించినంత ఆదరణ మాత్రం రావడం లేదు.

ఎవరు మీలో కోటీశ్వరులుల, బిగ్ బాస్ 5 సీజన్ వంటి కార్యక్రమాల ముందు మాస్టర్ చెఫ్ నిలబడలేకపోయింది. అంతేకాకుండా… టీఆర్పీ రేటింగ్ సైతం దారుణమైన స్థితిలో వస్తుంది. అయితే ఈ షోకు పెట్టిన ఖర్చు.. తమన్నాకు ఇస్తున్న రెమ్యూనరేషన్.. ఇతర జడ్జీలకు ఇస్తున్న ఖర్చులు అన్ని కలిపి చూసుకుంటే రాబడి కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నట్లుగా భావించారు నిర్వహకులు. దీంతో అగ్రిమెంట్ ప్రకారం తమన్నాతో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు చిత్రీకరించి.. ఆమెను తప్పించారని సమాచారం. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా స్థానాన్ని భర్తీ చేసేందుకు టాలీవుడ్ రంగమ్మత్తను రంగంలోకి తీసుకురానున్నారట. ఇక నుంచి మాస్టర్ చెఫ్ షోను బుల్లితెర యాంకర్ అనసూయ హోస్ట్ చేయబోతున్నట్లుగా టాక్. అనసూయ ఎంట్రీతో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం సక్సెస్ కావడం ఖాయమంటున్నారు. అలాగే బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు షోలతోపాటు.. మాస్టర్ చెఫ్ షో దూసుకోపోవడం ఖాయమంటున్నారు. మరి చూడాలి నిజంగానే… అనసూయ మాస్టర్ చెఫ్ గతిని మారుస్తుందా ? లేదా ? అని.

Also Read: Jr.NTR: నేనున్నా.. అధైర్యపడొద్దు.. అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్..

Pushpa Movies: పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్.. అనుకొని షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఎంత డిమాండ్ చేసిందంటే ?

Sherlyn Chopra: పార్టీల్లో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యాను.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్..