Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robots Patrol : ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఎందుకంటే..

Robots Patrol : షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగడం మనం తరుచుగా చూస్తుంటాం.

Robots Patrol : ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఎందుకంటే..
Robot
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 07, 2021 | 9:58 AM

Robots Patrol : షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగడం మనం తరుచుగా చూస్తుంటాం. వాటిని అరికట్టడం కోసం పోలీసులు, అధికారులు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సింగపూర్ ప్రభుత్వం సరికొత్త ప్రయత్నానికి తెర తేసింది. ఇందులో భాగంగా రోబో టెక్నాలజీని తీసుకువచ్చింది. ఈ రోబో టెక్నాలజీలో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది.

వివరాల్లోకెళితే.. సింగపూర్‌లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్‌లో రెండు చక్రాల రోబోతో గత మూడు వారాలుగా గస్తీ నిర్వహించారు. అక్కడ మాల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షించడమే కాకుండా ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఆ రోబో హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం, పార్కింగ్‌ సరిగ్గా చేయకపోయినా, కరోనా వైరస్‌ నేపథ్యంలో సామాజిక దూరం లాంటి నియమాలను ఉల్లఘించకుండా హెచ్చరికలనూ జారీ చేసేలా వీటిని రూపొందించారు.

ఏడు అత్యాధునిక కెమెరాలతో నిర్మితమైన ఈ రోబోలు మనుష్యుల ముఖాలను గుర్తించడమే కాకుండా, వారికి వాయిస్‌ రికార్డర్‌ ద్వారా హెచ్చరికలను కూడా జారీ చేస్తాయి. గత మూడు వారాల నుంచి అధికారులు ఈ రోబోలు పని తీరుపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. సింగపూర్‌ ప్రభుత్వాధికారులు హైపర్-ఎఫిషియెంట్, టెక్-డ్రైవ్డ్ “స్మార్ట్ నేషన్” పై దృష్టి సారించి ఈ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రోబోలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. అయితే, సింగపూర్‌వాసులు ఈ రోబోల వల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుందని, తమ గోప్యతకు భంగం వాటిల్లుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తుందంటూ సింగపూర్‌ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read:

నెక్లెస్ రోడ్‌లో ట్రేసర్ హంట్ పేరిట వినూత్న కారు ర్యాలీ.. వీడియో

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

China: తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు.. వీడియో