నెక్లెస్ రోడ్‌లో ట్రేసర్ హంట్ పేరిట వినూత్న కారు ర్యాలీ.. వీడియో
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ‘ట్రేసర్ హంట్’పేరిట వినూత్న కారు ర్యాలీ నిర్వహించారు..నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ… జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దాదాపు 123 కార్లు ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీలో పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ.. కార్ల యజమానులు డ్యాష్ బోర్డులు, టాప్‌పై సృజనాత్మకంగా కళారూపాలను ప్రదర్శించారు..విభిన్న వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. పర్యావరణ రక్షణ కోసం మహత్తర కార్యంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హరితహారం నిధిని ప్రకటించారని, ప్రజలు, అగర్వాల్ సమాజ్‌లాంటి సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యులు కావాలన్నారు. తెలంగాణ హరితనిధి ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అంజనీ కుమార్ అగర్వాల్.
మరిన్ని ఇక్కడ చూడండి: China: తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు.. వీడియో
Maa Elections 2021: బాలయ్య విష్ణు వైపే.. థాంక్స్ చెప్పిన విష్ణు.. వీడియో