Bathukamma: ‘ధరలు తగ్గించండి ఉయ్యాలో’.. గ్యాస్ సిలిండర్లతో మహిళల వినూత్న నిరసన.. అస్త్రంగా మలుచుకున్న టీఆర్ఎస్..

Bathukamma: బియ్యం, పప్పులు, ఉప్పులు, వంట నూనెలు మొదలు.. ఒక కుటుంబ మనుగడకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి.

Bathukamma: ‘ధరలు తగ్గించండి ఉయ్యాలో’.. గ్యాస్ సిలిండర్లతో మహిళల వినూత్న నిరసన.. అస్త్రంగా మలుచుకున్న టీఆర్ఎస్..
Public Protest


Bathukamma: బియ్యం, పప్పులు, ఉప్పులు, వంట నూనెలు మొదలు.. ఒక కుటుంబ మనుగడకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా పెరుగుతున్న రేట్లు పేదల జీవితాలను కుదిపేస్తున్నాయి. ఓవైపు ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతుండగా.. మరోవైపు నెలకు రెండుసార్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నారు. ఈ పెరుగుతున్న ధరలు చూసి సామాన్యులు ఉలిక్కిపడుతున్నారు. ఇలా అయితే.. తాము బతికేది ఏట్లా అంటూ వాపోతున్నారు. ఇప్పటికే మోయలేని భారంతో అతలాకుతలం అవుతున్న జనాలపై.. బుధవారం నాడు మరోసారి రేట్లు మరోసారి గుదిబండ మోపింది.

ఈ నేపథ్యంలోనే ప్రజల బతుకును కోరేత ‘బతుకమ్మ’ పండుగ పర్వదినాన.. ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. ‘బతుకమ్మ’ మాకు బతుకే లేకుండా పోతోందమ్మా అంటూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తు చేస్తున్నారు. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటకు బుదులు.. ‘ధరలు తగ్గించండి ఉయ్యాలో..’ అంటూ పల్లవి అందుకున్నారు. బతుకమ్మ- దసరా పండుగ కానుకగా బీజేపీ గ్యాస్ ధర పెంచిందంటూ పాటలు పాడారు. ఈ దృశ్యం తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో దర్శనమిచ్చింది. నియోజకవర్గంలో కొందరు మహిళలు బతుకమ్మ సంబరాలు తొలి రోజున.. బతుకమ్మల మధ్యన గ్యాస్ సిలిండర్ పెట్టి వినూత్న నిరసన చేపట్టారు. ‘ధరలు తగ్గించండి ఉయ్యాలో..’ అని పాటలు పాడుతూ బీజేపీ విధానాలనై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం మహిళల వినూత్న నిరసనకు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Protest

కాగా, వరుసగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకుంటోంది. అధిక ధరలనే అస్త్రాలు ఎక్కుపెట్టి బీజేపీని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్.. మరింత జోరు పెంచింది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ బాణాల్లాంటి విమర్శలను వదులుతోంది. తాజాగా హుజూరాబాద్‌లో బతుకమ్మ రూపంలో మహిళలు చేపట్టిన వినూత్న నిరసనను ఉటంకిస్తూ ఈటెలకు ప్రశ్నలు సంధించింది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అన్నీ తానై శ్రమిస్తున్న హరీష్ రావు.. బీజేపీ అభ్యర్థి ఈటెలను ఇరకాటంలో పెట్టే ప్రయతనం చేస్తున్నారు. తాజా ఫోటోలను చూపుతూ..

Protest 2

‘‘చూడు రాజేంద్ర..! హుజురాబాద్ మహిళల చైతన్యం ఏంటో..!’’ అని మంత్రి హరీష్ రావు.. ఈటెలపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, గ్యాస్‌ సిలిండర్ ధర పెంచి ప్రజలకు వాతలు పెడుతోందంటూ మండిపడ్డారు. అక్కా చెళ్లెళ్లు బతుకమ్మల మధ్య సిలిండర్లు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారని గుర్తుచేశారు. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసిన బీజేపీ.. నిన్న మరో రూ.15 పెంచిందని విమర్శించారు. వారం వారం గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతోందని బీజేపీ విధానాలను తూర్పారబట్టారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేద్దామా..? అంటూ ప్రజలను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి వాతలు పెడుతోందని, సబ్సిడీల్లో కోతలు విధిస్తోందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆరు సార్లు ఈటలను గెలిపించారని, అయితే ఆయన నియోజకవర్గంలోని పేదల కోసం ఒక్క ఇళ్లు ‌‌కట్టలేదని మంత్రి విమర్శించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ని ఒక్కసారి‌ గెలిపిస్తే.. డుబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.

Also read:

Astro Remedies for Career: కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలా? అయితే ఈ జ్యోతిష్య చిట్కాలు పాటించండి..

Viral News: 50 ఏళ్లుగా పచ్చి మాంసమే తింటున్నాడు.. సడెన్‌గా విషయం తెలిసిన భార్య ఏం చేసిందంటే..

Telangana News: భూమి నుంచి ఒక్కసారిగా ఉబికి బయటకు వచ్చిన నీటి సంపు.. షాక్ అయిన గ్రామస్తులు..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu